డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,10 డిసెంబరు 2024: గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన బిర్లా ఓపస్ పెయింట్స్ – ఆదిత్య బిర్లా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ, ఈ వారం తెలంగాణలోని హైదరాబాద్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీ స్టోర్లను ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో బ్రాండ్ తన మొదటి స్టోర్లను ఇస్మత్ నగర్, మణికొండ, రసూల్‌పురా, బండ్లగూడ జాగీర్‌లలో ప్రారంభించింది.

ఇప్పుడు, ఈ స్టోర్లను మరింత విస్తరించి, హైదరాబాద్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీ స్టోర్లను ప్రారంభించింది. అవి గచ్చిబౌలిక్రాస్ రోడ్‌లోని శ్రీ మహాలక్ష్మి ఏజెన్సీలు,మేడ్చల్ మల్కాజిగిరిలోని చౌదరి బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో.

ఈ ఫ్రాంఛైజీ స్టోర్లలో, బిర్లా ఓపస్ పెయింట్స్ ఉత్పత్తులు విస్తృతమైన షేడ్స్‌ను అందించేందుకు వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ ప్రాంతానికి సంబంధించిన వారసత్వం,సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే విధంగా, వీటి ద్వారా వినియోగదారులు తమకు కావలసిన రంగులను,ఉత్పత్తులను గుర్తించడంలో సహాయపడటానికి టెక్స్‌చర్ డిస్‌ప్లేలు, షేడ్ డెక్‌లు, నిపుణుల సంప్రదింపులు అందించబడతాయి.

ఈ కొత్త ఫ్రాంఛైజీ స్టోర్లు, బిర్లా ఓపస్ పెయింట్స్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విస్తరణ ప్రణాళికలో భాగంగా ప్రారంభించబడ్డాయి. భారతదేశంలో లూథియానా, పానిపట్, చెయ్యార్,ఇప్పుడు చామరాజ్‌నగరలో ఉన్న నాలుగు అత్యాధునిక, ఆటోమేటెడ్ తయారీ ప్లాంట్లు సంస్థ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

కొత్తగా ప్రారంభించిన చామరాజ్‌నగర ఫెసిలిటీ బిర్లా ఓపస్ పెయింట్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 860+ మిలియన్ లీటర్లకు (MLPA) పెంచింది, తద్వారా ఇది ఇన్‌స్టాల్డ్ సామర్థ్యంతో 2వ అతిపెద్ద డెకరేటివ్ పెయింట్స్ ప్లేయర్‌గా ఎదిగింది.

తెలంగాణలో కొత్తగా ప్రారంభమైన ఈ ఫ్రాంఛైజీ స్టోర్ల ద్వారా, హైదరాబాద్‌లోని వినియోగదారులు,వ్యాపారులు తమకు కావలసిన రంజుల,ఉత్పత్తుల అన్వేషణను ప్రారంభించేందుకు ఆహ్వానించబడ్డారు. ఈ కొత్త స్టోర్లు, ప్రీమియం నాణ్యత ఉత్పత్తులు, నిపుణుల మార్గదర్శకత్వం,వినూత్న పరిష్కారాలతో వినియోగదారుల అభిరుచులకు అందుబాటులో ఉంటాయి.

బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్‌గేవ్ మాట్లాడుతూ, “ఈ ఏడాది Hyderabad కు నా మూడవ సందర్శన ఇది, ఇంకా ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. తెలంగాణలో మా ఫ్రాంఛైజీ స్టోర్లను విస్తరించడం, ఉత్పత్తులపై వినియోగదారుల నుండి వచ్చిన అద్భుతమైన స్పందనలను వినడం చాలా సంతోషంగా ఉంది.

ఈ సహకారం మాకు కొత్త మైలురాళ్లను చేరుకోవడంలో ప్రేరణనిస్తుంది. 145 ఉత్పత్తుల్లో 80% ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉండడంతో, బిర్లా ఓపస్ పెయింట్స్ త్వరలో భారతదేశంలో రెండవ-అతిపెద్ద డీలర్ నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తుంది.6000 పట్టణాలలో కూడా మా ఉనికిని పెంచుకోబోతుంది” అని అన్నారు.

కొత్తగా ప్రారంభించిన ఫ్రాంఛైజీ స్టోర్ల వివరాలు:

  1. స్టోర్ 1 – శ్రీ మహాలక్ష్మి ఏజెన్సీస్, D.No.1-64/1, రహ్మత్ గుల్షన్ కాలనీ, గచ్చిబౌలిక్రాస్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ – 500032
  2. స్టోర్ 2 – చౌదరి బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో, ప్లాట్ నెం. 03 & 19, NH రోడ్ దగ్గర – మేడ్చల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ – 501401

ఈ స్టోర్లు సోమవారం నుంచి శనివారం వరకు వినియోగదారులకు తెరిచి ఉంటాయి. ఆదివారాలు మినహా వారపు రోజులలో స్టోర్లలో అందించే ఆఫర్లను అన్వేషించడానికి వినియోగదారులను స్వాగతిస్తున్నారు.

భారతదేశంలోని ప్రముఖ పెయింట్ బ్రాండ్‌గా ఎదిగే బిర్లా ఓపస్ పెయింట్స్ ఇప్పటికే 80+ నగరాల్లో ఫ్రాంఛైజీ స్టోర్లను ప్రారంభించింది, 150+ నగరాలలో ఈ స్టోర్లు త్వరలో ప్రారంభం కానున్నాయి.