డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ఆగస్ట్ 23, 2024:బ్లాక్‌స్టోన్ పోర్ట్‌ఫోలియో కంపెనీ అయిన ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ (ఇండియా) లిమిటెడ్ (INTERNATIONAL GEMMOLOGICAL INSTITUTE (INDIA) LIMITED) తమ ఐపీవోకి సంబంధించి సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 1,250 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 2,750 కోట్ల వరకు విలువ చేసే షేర్లను (ఒక్కోటి రూ. 2 ముఖ విలువ) విక్రయించనున్నారు.

ప్రమోటరు సెల్లింగ్ షేర్‌హోల్డరు బీసీపీ ఏషియా II టాప్‌కో Pte. Ltd. రూ. 2,750 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుంది. అర్హత కలిగిన ఉద్యోగులకు షేర్లలో కొంత భాగం రిజర్వ్ చేయబడుతుంది. నికరంగా సమీకరించిన నిధులను కంపెనీ (a) ఐజీఐ బెల్జియం గ్రూప్ మరియు ఐజీఐ నెదర్లాండ్స్ గ్రూప్‌ను ప్రమోటరు నుంచి కొనుగోలు చేసేందుకు; (b) ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకోనుంది.

ఐజీఐ ఇండియా అనేది అంతర్జాతీయ మార్కెట్లో పేరొందిన సర్టిఫయర్లలో ఒకటైన ఐజీఐలో భాగంగా ఉంది. నేచురల్ డైమండ్స్, ల్యాబరేటరీ డైమండ్స్, స్టడెడ్ జ్యుయలరీ, కలర్డ్ స్టోన్స్ సర్టిఫికేషన్,అక్రెడిటేషన్ సర్వీసులు అందిస్తోంది.

యాక్సిస్ క్యాపిటల్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.