డైలీ మిర్రర్ న్యూస్, జూలై 15,2024 : జాన్సన్ గ్రామర్ స్కూల్, కుంట్లూరు ఆధ్వర్యంలో జూలై 15 తేదీన సిఐయస్‌సిఈ ఏపి, తెలంగాణా ప్రాంతీయ బాలికల కబడ్డీ టోర్నమెంట్ (14, 17, 19 సంవత్సరాల లోపు బాలికల) ప్రారంభం అయ్యింది. జాన్సన్ గ్రామర్ స్కూల్, కుంట్లూరు ఈ రెందురోజుల (జులై 15, 16) ప్రాంతీయ కబడ్డీ టోర్నమెంట్ (బాలికల) ఆతిథ్యం ఇచ్చి విశిష్ట గౌరవాన్ని పొందింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ సిఐయస్‌సిఈ పాఠశాలల నుంచి 350 మంది విద్యార్హినులు ఈ పోటిలో పాల్గొంటున్నారు. రేపటితో ఈ టోర్నమెంట్ ముగుస్తుంది.
ఆహ్లాదకరంగా ప్రారంభమైన ఈ వేడుకలను పూజ్య స్థాపకుడు స్వర్గీయ ఎస్‌ఆర్‌ఎన్ ముదిరాజ్ కి పూలమాలలు వేసి నివాళులర్పించిన తరువాత లాంఛనప్రాయమైన జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్కూలు స్థాయిలోనే బాలురతో పాటు బాలికలను కూడా క్రీడాల్లో భాగము చేయాలన్న ఉద్దేష్యంతో ఈ బాలికల కబడ్డి టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు, కుంట్లూరు, ఎల్ బి నగర్ జాన్సన్ గ్రామర్ స్కూల్ చైర్మన్ డాక్టర్. బి. మల్లికార్జున్ రావు తెలిపారు.
ముఖ్యంగా కబడ్డి లాంటి క్రీడాల ద్వారా చురుకుదనము, శరీరిక పటుత్వము వస్తుందని, ఇది పెరుగుతున్న బాల బాలికలకు ఎంతో అవసరమని మల్లికార్జున్ రావు అన్నారు. ఏపి, తెలంగాణా ప్రాంతీయ బాలికల కబడ్డీ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చినందుకు ఆనందంగా ఉన్నదని ఆయన అన్నారు.
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు గౌరవనీయులైన కుంట్లూరు,ఎల్ బి నగర్ జాన్సన్ గ్రామర్ స్కూల్ చైర్మన్ డాక్టర్. బి. మల్లికార్జున్ రావు హాజరైనారు. ముఖ్య అతిథిగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, గౌరవ అతిథిగా ఏపి, తెలంగాణ రీజియన్ ప్రెసిడెంట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జాయింట్ కోఆర్డినేటర్, హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ టి. అనిల్ ఇజ్రాయెల్, రంగారెడ్డి కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రవి కుమార్, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.