
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 14, 2025: భారతదేశంలో ఇంజినీరింగ్ విద్యలో అగ్రగామిగా కొనసాగుతున్న కర్ణాటక, విద్యార్ధులకు మరింత అవకాశాలను అందించేందుకు COMEDK UGET / Uni-GAUGE 2025 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నది. ఈ పరీక్ష మే 10, 2025 (శనివారం)న ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నారు.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా కర్ణాటకలోని 150కి పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు, అలాగే దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రఖ్యాత స్వయం నిధుల విశ్వవిద్యాలయాలకు చేరిక అవకాశాలు లభించనున్నాయి.
కర్ణాటక అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్ (KUPECA),Uni-GAUGE సభ్య విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా B.E/B.Tech కోర్సుల్లో చేరదలచిన అభ్యర్థులు ఈ పరీక్ష రాయవచ్చు.
ఇది కూడా చదవండి..కిస్ డే 2025: ముద్దు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎనిమిది ప్రయోజనాలు..
Read this also..COMEDK/ Uni-GAUGE UGET 2025: Application Dates Announced for Engineering Aspirants
ఈసారి పరీక్ష 200కి పైగా నగరాల్లో 400కుపైగా పరీక్షా కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. 1,20,000 మందికిపైగా విద్యార్థులు హాజరవుతారని అంచనా. దేశవ్యాప్తంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 3, 2025 నుంచి మార్చి 15, 2025 వరకు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు www.comedk.org లేదా www.unigauge.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
COMEDK ఇన్నోవేషన్ హబ్‌లు – నూతనతరానికి నైపుణ్య శిక్షణ
2022లో, విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించేందుకు COMEDK ప్రత్యేకంగా 8 COMEDK KARES ఇన్నోవేషన్ హబ్‌లను ప్రారంభించింది. ప్రస్తుతం 10 ఇన్నోవేషన్ హబ్‌లు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.
బెంగళూరులో నాలుగు కేంద్రాలతో పాటు మైసూరు, కలబురగి, మంగళూరు, బెల్గాం, తుమకూరు, హుబ్బళ్లిల్లో ఇవి విస్తరించాయి.
ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ (AIML), రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), డేటా సైన్స్, ఇన్నోవేషన్ & డిజైన్ థింకింగ్ (IDT) వంటి అత్యాధునిక కోర్సులు అందిస్తున్నారు. విద్యార్థులు పరిశోధనాత్మకంగా అభివృద్ధి చెందేందుకు ఈ కేంద్రాలు అనుకూలంగా ఉంటాయి.
COMEDK ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ ఎస్. కుమార్ మాట్లాడుతూ, “COMEDK ద్వారా విద్యార్థులకు న్యాయం, పారదర్శకత, సమాన అవకాశాలను కల్పిస్తున్నాము. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఉత్తమ కళాశాలల్లో చేరే అవకాశం కల్పించడం మా లక్ష్యం” అని తెలిపారు.

ERA ఫౌండేషన్ సీఈఓ పి. మురళీధర్ మాట్లాడుతూ, “Uni-GAUGE ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలను అందిస్తూ, భారతదేశ భవిష్యత్ శ్రామిక శక్తి అభివృద్ధికి తోడ్పడుతున్నాము” అని అన్నారు.
పరీక్ష, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారిక వెబ్‌సైట్లు www.comedk.org, www.unigauge.com ద్వారా తెలుసుకోవచ్చు.