డైలీమిర్రర్ డాట్ న్యూస్,హైద‌రాబాద్, జ‌న‌వ‌రి 2, 2025:  అమెరికాకు చెందిన క‌స్ట‌మ‌ర్ ఎక్స్‌పీరియెన్స్ (సీఎక్స్) ఎష్యూరెన్స్ రంగంలో అంత‌ర్జాతీయంగా అగ్ర‌స్థానంలో ఉన్న సియారా.. త‌న కొత్త గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ సెంట‌ర్ (జీఐసీ)ని హైద‌రాబాద్‌లో తెరుస్తున్న‌ట్లు స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించింది. ఈ వ్యూహాత్మక విస్తరణ భారతదేశపు విస్తారమైన టాలెంట్ పూల్ ను ఉపయోగించు కోవడానికి, త‌న పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను పెంచడానికి సియారా నిబద్ధతను చాటుతుంది.

ఈ కొత్త కార్యాలయం 200కి పైగా ఉద్యోగాలను సృష్టిస్తుంది. సియారా అత్యాధునిక పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడానికి అంకితమైన శక్తివంతమైన, డైనమిక్ బృందాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ సదుపాయం సృజనాత్మకతకు కీలకమైన కేంద్రంగా పనిచేస్తుంది, ఉత్పత్తి అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. సీఎక్స్ సిఎక్స్ ఎష్యూరెన్స్ పరిశ్రమలో సియారా స్థానాన్ని ఇది బలోపేతం చేస్తుంది.

ఈ స‌రికొత్త కేంద్రం ప్రారంభంపై సియారా సీఈఓ రిషి రాణా హర్షం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో మా కార్యాలయాన్ని ప్రారంభించడం సియారా అభివృద్ధి వ్యూహంలో ఒక పెద్ద ముందడుగు. భారతదేశం టెక్నాలజీ మేధావులకు నిలయం.

ఈ టాలెంట్ పూల్ ను అందిపుచ్చుకోవడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. హైదరాబాద్‌లో మా పెట్టుబడి కస్టమర్ ఎక్స్ పీరియన్స్ ఎష్యూరెన్స్‌లో సృజనాత్మకత, శ్రేష్ఠతకు మా అంకితభావాన్ని నొక్కి చెబుతుంది.

సీఎక్స్ ఎష్యూరెన్స్‌లో సాధ్యమయ్యే దాని సరిహద్దులను ముందుకు తీసుకెళ్లడంలో మాకు సహాయపడే శక్తివంతమైన, డైనమిక్ టీమ్ ను నిర్మించడానికి మేము ఎదురు చూస్తున్నాము” అని చెప్పారు.

సియారా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ యోగేష్ మోరే మాట్లాడుతూ, “మా పరిష్కారాలను ఆధునీకరించడం, నవీకరించడం కొనసాగించడానికి సియారా ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైన దశ. కాంటాక్ట్ సెంటర్ పరిశ్రమపై లోతైన అవగాహనతో అవసరమైన సాంకేతిక నైపుణ్యాల లోతును అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశం మాకు దోహదపడుతుంది” అని తెలిపారు.

హైదరాబాద్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌లోకి సియారా విస్తరణ దాని అంత‌ర్జాతీయ విస్త‌ర‌ణ‌ను బలోపేతం చేయడమే కాకుండా, ప్రపంచ స్థాయి కస్టమర్ ఎక్స్ పీరియన్స్ పరిష్కారాలను అందించాలనే కంపెనీ లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంటుంది. సృజనాత్మకత, శ్రేష్ఠత, కమ్యూనిటీ నిమగ్నత పట్ల సియారా అచంచ‌ల నిబద్ధతకు ఈ కొత్త కార్యాలయం నిదర్శనం.