డైలీ మిర్రర్ డాట్ న్యూస్, అక్టోబర్ 23,2024 : చాలామంది రొమాన్స్ అనగానే, అది కేవలం సెక్స్ ముందు చేసే ఒక పని అనుకుంటారు. కానీ నిజానికి రొమాన్స్, సెక్స్ కి సంబంధం లేని ఒక ప్రత్యేక భావన. సెక్స్ అనేది శారీరక అవసరం, అయితే రొమాన్స్ మానసిక స్థాయిలో మనసుకు ప్రశాంతతను అందించే ఒక ఫీల్.
రొమాన్స్ – మనసుకు అవసరమైన ఫీల్ గుడ్ మూమెంట్స్..
సెక్స్ హార్మోన్స్ ప్రభావంతో శరీరం కావాలని కోరుకుంటుంది. కానీ రొమాన్స్ 100% మనసుకు సంబంధించినది. మహిళలకు రొమాన్స్ ఆవశ్యకతపై కొంత అవగాహన ఉండవచ్చు, కానీ చాలా మంది మగవాళ్లు దీనిని అవమానంగా భావిస్తూ దూరంగా ఉంటారు.
రొమాన్స్ ఎలా ఉండాలి?
రొమాన్స్ అంటే శరీరానికి మాత్రమే కాకుండా, మనసుకు కూడా ఆనందాన్ని ఇచ్చే మూమెంట్స్. ఉదాహరణకు, అలసిపోయినప్పుడు ఒక మంచి కాఫీ తాగినప్పుడు కలిగే సంతోషం, లేదా వర్షం పడేటప్పుడు బజ్జీలను తినాలనిపించే ఆ ఫీలింగ్ – ఇవన్నీ రొమాన్స్ లో భాగం. అదే విధంగా చలికాలంలో వెచ్చని బెడ్ షీట్ లో నిద్రపోవడం, మంచి పుస్తకం చదవడం లాంటి సందర్భాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
రొమాన్స్ లో భాగమైన ముఖ్యమైన అంశాలు:
- పరస్పర మాటలతో
- సరసాలు
- అనురాగంతో హత్తుకోవడం
- చూపులతో, పెదవులతో, చేతులతో ఆనందానుభూతి కలిగించడం
- వెచ్చని కౌగిలిలో మాట్లాడుకోవడం
ఈ రొమాంటిక్ మూమెంట్స్ మనసుకు చాలా ప్రశాంతత, ఆనందం అందిస్తాయి. మనిషి జీవితంలో ఆరాధన, అభిమానం, ప్రేమ కీలక పాత్ర వహిస్తాయి.
రొమాన్స్ గురించి అవగాహన..
అయితే, రొమాన్స్ అనేది సెక్స్ కంటే వేరే అనుభూతి అని చాలా మందికి తెలియదు. వారికి దీనిపై అవగాహన కలిగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, రొమాన్స్ అనేది ఒక సుదీర్ఘ జీవన ప్రయాణంలో మనసుకు అవసరమైన భావనలలో ఒకటి.