
డైలీ మిర్రర్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 8, 2024: భారతదేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ప్రముఖమైన ఫెడరల్ బ్యాంకు.. డైనమిక్ నగరమైన హైదరాబాద్‌లో 50 ఏళ్లు పూర్తిచేసుకుని, ఒక ప్రధానమైన మైలురాయిని దాటింది. గత ఐదు దశాబ్దాలుగా, బ్యాంకు గణనీయమైన వృద్ధిని సాధించింది. తెలంగాణ అంతటా తన ఉనికిని విస్తరించింది. వ్యక్తులు, వ్యాపారాలకు నమ్మకమైన ఆర్థిక భాగస్వామిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఫెడరల్ బ్యాంక్ తెలంగాణలోని 37 శాఖలకు తన నెట్‌వర్కును విస్తరించింది. ఇది సమగ్ర శ్రేణి బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మకంగా ఉన్న కార్పొరేట్ ఇన్ స్టిట్యూషనల్ బ్యాంకింగ్ (సీఐబీ), కమర్షియల్ బ్యాంకింగ్ (సీఓబీ), ట్రెజరీ సేల్స్, సెంట్రలైజ్డ్ రిటైల్ క్రెడిట్ హబ్ (సీసీఎస్‌సీ) బృందాలలో ఈ ప్రాంతం పట్ల బ్యాంకు నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. పెరుగుతున్న కార్పొరేట్ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి, ప్రత్యేకమైన లార్జ్ కార్పొరేట్ రిలేషన్‌షిప్ డివిజన్ (ఎల్‌సీఆర్‌డీ), ఇంకా కార్పొరేట్ శాలరీ టీమ్ కూడా ఏర్పాటయ్యాయి.
కార్పొరేట్ బ్యాంకింగ్ కు మించి, ఫెడరల్ బ్యాంక్ గృహ, కారు రుణాలపై దృష్టి సారించిన ప్రత్యేక రిటైల్ సేల్స్ బృందంతో రిటైల్ విభాగంలో గణనీయమైన పురోగతి సాధించింది. సెంట్రలైజ్డ్ రిటైల్ క్రెడిట్ హబ్ (సీఆర్‌సీహెచ్) బెంగళూరు, ఇంకా హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రాంతీయ క్రెడిట్ హబ్ (ఆర్‌సీహెచ్) బృందంతో గ్రామీణ, వ్యవసాయ అభివృద్ధి అనే కీలకమైన రంగాలకు కూడా బ్యాంక్ ఉనికి విస్తరించింది.
హైదరాబాద్ నగరంలో దాదాపు రూ.10,500 కోట్ల లోన్‌బుక్‌తో ఫెడరల్ బ్యాంక్ ప్రధానంగా రిటైల్ బ్యాంకింగ్ పై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాల్లో కూడా ఈ బ్యాంకు చురుకైన భాగస్వామిగా ఉంది.
మున్ముందు ఫెడరల్ బ్యాంక్ మరింత విస్తరణకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది 10 నుంచి 12 కొత్త శాఖలను ప్రారంభించాలని యోచిస్తోంది.
తర్వాతి సంవత్సరం కూడా అదే స్థాయిలో కొత్తశాఖలను తెరవాలని భావిస్తోంది. సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పూర్తి స్థాయి జోన్ గా మారాలనే దార్శనికతతో, ఈ ప్రాంత ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడే సామర్థ్యంపై బ్యాంకు విశ్వాసం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఫెడరల్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జోనల్ విభాగాధిపతి బి. దిలీప్ హైదరాబాద్ ప్రలకు తన కృతజ్ఞతలు తెలిపారు. “బ్యాంకు అసాధారణ ఆర్థిక పరిష్కారాలను అందిస్తూ, నగర పురోగతికి, సమగ్రాభివృద్ధికి తోడ్పడేందుకు కట్టుబడి ఉంది. మామీద ఉంచిన అపారమైన నమ్మకానికి, మాకు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు” అని చెప్పారు.