సంక్రాంతికి గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబో భారీ బ‌డ్జెట్ మూవీ ‘గేమ్ చేంజర్’

డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,14అక్టోబర్, 2024: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌.

ముందుగా ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యంపై చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు స్ప‌ష్ట‌తనిచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ

‘‘‘గేమ్ చేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ప్పుడు క్రిస్మ‌స్ కంటే సంక్రాంతి అయితే బావుంటుంద‌ని నాతో పాటు  బాలీవుడ్‌, కోలీవుడ్, క‌ర్ణాట‌క‌ ఓవ‌ర్ సీస్‌లోని ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ భావించాం.

ఈ ఆలోచ‌న‌ను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ సంస్థ‌కు తెలియ‌జేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నామ‌ని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభ‌ర‌’ సినిమా కూడా భారీ బ‌డ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వ‌స్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. అందువ‌ల్ల సంక్రాంతి డేట్ కావాల‌ని చిరంజీవిగారిని, యువీ వారిని అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు.

‘గేమ్ చేంజర్’ సినిమాను సంక్రాంతికి రావ‌టానికి వాళ్ల విశ్వంభ‌ర సినిమాను మ‌రో రిలీజ్ డేట్‌కు విడుద‌ల చేయాల‌నుకున్నారు. నిజానికి విశ్వంభ‌ర సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌తో స‌హా పూర్త‌వుతుంది. అయితే నా కోసం, మా సినిమా కోసం వాళ్ల సినిమాను మ‌రో రిలీజ్ డేట్‌కు రిలీజ్ చేయ‌టానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ వంశీ, ప్ర‌మోద్‌, విక్కీకి నా ధ‌న్య‌వాదాలు.

గేమ్ చేంజర్’ సినిమాను సంక్రాంతి విడుద‌ల చేస్తున్నాం. ఇటు అభిమానుల‌కు, అటు సినీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను తీర్చిదిద్ద‌తూ రాత్రింబ‌గ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నాం. ఆల్ రెడీ రెండు పాట‌లు విడుద‌లయ్యాయి. రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి. రీసెంట్‌గా వ‌చ్చిన ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ యూ ట్యూబ్‌లో మారుమోగిపోతుంది.

త‌ర్వాత టీజ‌ర్ వ‌స్తుంది. త‌ర్వాత మ‌రో మూడు పాట‌ల‌ను రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజ‌యం సాధించేలా ప్లాన్ చేశాం. అటు రామ్ చ‌ర‌ణ్‌గారికి గ్లోబ‌ల్ స్టార్ అనే బ్రాండ్ ఏదైతే ప‌డిందో దాన్ని.. గ్లోబ‌ల్‌గా ఈ సినిమా విజ‌యం సాధించేలా ప్ర‌య‌త్నిస్తున్నాం. ఆ ప్ర‌య‌త్నం ఫలిస్తుంది. సంక్రాంతికి క‌లుద్దాం’’ అన్నారు.

*Dil Raju Garu Video Byte Download Link*

https://we.tl/t-1gGKrG8jF

editor daily mirror

Related Posts

Diageo India launches regenerative agriculture programme aimed at reducing carbon and water footprint in its supply chain

Dailymirror.news,India,November 12th, 2024 : Diageo India (United Spirits Ltd.), among the country’s leading beverage alcohol companies today announced the

Zomato Food Rescue Feature: Preventing Waste and Offering Great Deals.

Dailymirror.news,12th November,2024:Zomato has launched its new Food Rescue feature, designed to reduce food wastage while offering customers incredible

You Missed

Diageo India launches regenerative agriculture programme aimed at reducing carbon and water footprint in its supply chain

Diageo India launches regenerative agriculture programme aimed at reducing carbon and water footprint in its supply chain

Zomato Food Rescue Feature: Preventing Waste and Offering Great Deals.

Zomato Food Rescue Feature: Preventing Waste and Offering Great Deals.

Fujifilm Instax Mini SE Review: Compact and Simple, but the Price May Be a Dealbreaker.

Fujifilm Instax Mini SE Review: Compact and Simple, but the Price May Be a Dealbreaker.

ఐఐటీ భువనేశ్వర్, మోసార్ట్ ల్యాబ్స్ సంయుక్తంగా ప్రారంభించిన ఆధునిక సెమీకండక్టర్, చిప్ డిజైన్ డిప్లమా కార్యక్రమం

ఐఐటీ భువనేశ్వర్, మోసార్ట్ ల్యాబ్స్ సంయుక్తంగా ప్రారంభించిన ఆధునిక సెమీకండక్టర్, చిప్ డిజైన్ డిప్లమా కార్యక్రమం

Ladakh Autonomous Hill Development Council (LAHDC) & Aditya Mehta Foundation signs historic MOU

Ladakh Autonomous Hill Development Council (LAHDC) & Aditya Mehta Foundation signs historic MOU

Effective Strategies for Secure File Sharing in the Digital Era

Effective Strategies for Secure File Sharing in the Digital Era