డైలీ మిర్రర్ డాట్ న్యూస్,మల్కాజ్గిరి, డిసెంబర్ 2,2024: భారతీయ సంప్రదాయం ,ఆధ్యాత్మిక ఉత్పత్తుల రంగంలో ప్రఖ్యాతి గాంచిన గిరి సంస్థ, హైదరాబాదులో మల్కాజ్గిరిలో తమ సరికొత్త షోరూమ్‌ను సోమవారం సగర్వంగా ప్రారంభించింది.

ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తూ, సంప్రదాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో గిరి సంస్థ ఈ కొత్త మల్కాజ్గిరి షోరూమ్‌ను ప్రారంభించింది.

ఈ షోరూమ్‌లో ఆధ్యాత్మిక పుస్తకాలు, పూజా సామాగ్రి, సంప్రదాయ వస్త్రాలు, భక్తి గీతాలు, ఇతర ఆధ్యాత్మిక,సాంస్కృతిక ఉత్పత్తులను అత్యున్నత నాణ్యతతో అందిస్తారు. మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన ప్రజలతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాలవారికి కూడా ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు ఇది రూపొందించబడింది.

ఈ సందర్భంగా గిరి సంస్థ డైరెక్టర్ శ్రీమతి శారదా ప్రకాష్ గారు మాట్లాడుతూ, “హైదరాబాదులో గిరి సంస్థ ఈ విస్తరణ మా ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. మేం ఎల్లప్పుడూ నాణ్యతా ప్రమాణాలను పాటించి, సంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మిక వనరులను అందించడంలో ముందుంటాము.

హైదరాబాద్ నగరవాసులకు ఆధ్యాత్మిక ఉత్పత్తులను మరింత చేరువ చేయడం మా లక్ష్యం” అని పేర్కొన్నారు.

గిరి సంస్థ కొత్త షోరూమ్ ప్రారంభంతో, మల్కాజ్గిరి ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక, సాంప్రదాయ ఉత్పత్తుల కోసం ప్రామాణికమైన ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. ఈ షోరూమ్‌ ద్వారా వినియోగదారుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, వారిని తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడడం గిరి సంస్థ ప్రధాన ఉద్దేశం.