డైలీ మిర్రర్ డాట్ న్యూస్, నవంబర్ 5,2024:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న గ్రాండ్ రిలీజ్ కానుంది. నవంబర్ 9న లక్నోలో ఈ మూవీ టీజర్‌ను విడుదల చేస్తున్నారు.
‘గేమ్ చేంజర్’ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు, ఆదిత్య రామ్‌లు పాల్గొన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, “నా 21 ఏళ్ల ప్రయాణంలో నిర్మాతగా ‘గేమ్ చేంజర్’ నా 50వ సినిమా. సినిమా షూటింగ్ పూర్తయింది. మూడేళ్ల క్రితం శంకర్ గారు ఈ సినిమా స్టోరీ లైన్ నాకు చెప్పగానే ఎగ్జైటెడ్ అయ్యాను. ఆదిత్య రామ్ గారు నాకు మంచి స్నేహితుడు. ఆయన మునుపు తెలుగు సినిమాలను నిర్మించారు.
తర్వాత ఆయన చెన్నైలో రియల్ ఎస్టేట్ రంగంలో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన్ని కలిసినప్పుడు నేను గేమ్ చేంజర్ మూవీని చేస్తున్నానని చెప్పగానే, ఆయన కూడా ఇన్‌స్పైర్ అయ్యారు. ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్‌ను చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ ట్రావెల్ కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాతో పాటు, మరికొన్ని తమిళ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు కూడా మేం నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం.
వారిసు సినిమా తర్వాత నేను తమిళంలో ఇంకా సినిమాలు చేయాలనుకుంటున్నాను. నవంబర్ 9న గేమ్ చేంజర్ టీజర్‌ను లక్నోలో విడుదల చేయబోతున్నాం. తర్వాత యు.ఎస్‌లో ఓ భారీ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత చెన్నైలో కూడా ఒక ఈవెంట్ జరగబోతుంది. జనవరి తొలి వారంలో ఏపీ, తెలంగాణల్లో ఈవెంట్స్ నిర్వహిస్తాం. జనవరి 10న సంక్రాంతి స్పెషల్‌గా గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేస్తాం.
మేము చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. యూనివర్సల్‌గా గేమ్ చేంజర్ సినిమా అందరినీ మెప్పిస్తుంది. శంకర్ గారు దర్శకత్వం వహిస్తున్న సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ చిత్రంలో సాంగ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా ఉంటుంది. ఇవన్నీ గేమ్ చేంజర్ మూవీలో ఉంటాయి.
ట్రిపులార్ తర్వాత రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్.జె.సూర్యగారు కీ రోల్ చేశారు. తమన్ ఫెంటాస్టిక్ సాంగ్స్ అందించారు” అన్నారు.
ఆదిత్య రామ్ మాట్లాడుతూ, “నేను సినీ రంగం నుంచి గ్యాప్ తీసుకొని 10 సంవత్సరాలకు పైగా అయింది. దిల్‌రాజు గారితో కలిసి ఈ రోజు మీ ముందుకు వచ్చాను. నేను ఆదిత్యరామ్ మూవీస్ బ్యానర్‌లో నాలుగు సినిమాలు చేశాను. ప్రభాస్‌గారితో ‘ఏక్ నిరంజన్’ సినిమా నిర్మించిన తర్వాత బ్రేక్ తీసుకున్నాను.
రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టాను. అందువల్ల బ్రేక్ వచ్చింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఎస్‌వీసీతో కలిసి ఆదిత్యరామ్ మూవీస్ ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేస్తుంది. అలాగే మా కాంబినేషన్‌లో తమిళంతో పాటు పాన్ ఇండియా సినిమాలను కూడా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం.
మంచి కథలు, డైరెక్టర్లతో మంచి సినిమాలు చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. దిల్‌రాజు గారికి సంబంధించి, మంచి కథను సెలక్ట్ చేసుకుని, స్క్రిప్ట్‌ను గొప్పగా సిద్ధం చేసి, కొత్త దర్శకుడిని ఎంచుకుని సినిమా చేస్తారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో బ్లాక్‌బస్టర్స్, హిట్ సినిమాలు చేసిన నిర్మాత దిల్‌రాజు గారు. ఆయనతో కలిసి సక్సెస్‌ఫుల్ సినిమాలు నిర్మిస్తానని నమ్మకంగా ఉన్నాను” అన్నారు.