డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, 19 నవంబర్ ,2024:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహ్మాన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కడప దర్గాను సందర్శిస్తానని చెప్పిన చరణ్, ఇంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌లో హాజరయ్యారు.

ఈ దర్గాకు ఎ.ఆర్. రెహ్మాన్‌ తరచుగా సందర్శించేవారు. 2024లో జరిగే 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ను తీసుకురావాలని రెహ్మాన్‌ సూచించగా, ఆయన చరణ్‌ను ఆహ్వానించారు. బిజీ షెడ్యూల్‌, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ, రెహ్మాన్‌తో ఉన్న అనుబంధం కారణంగా, చరణ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ విశేషం అక్కడి వారికీ ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.

ఈ సందర్భంలో రామ్ చరణ్ మాట్లాడుతూ, “కడప దర్గాతో నా ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ దర్గాను సందర్శించడం నా కోసం చాలా మాన్యమైనది. నా కెరీర్‌లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ‘మగధీర’ సినిమా విడుదలకు ముందు ఈ దర్గాను సందర్శించాను.

ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, నేను స్టార్‌డమ్‌ పొందాను అన్నది అందరికీ తెలిసిందే. అలాగే, ఎ.ఆర్. రెహ్మాన్‌గారు ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి నాకు ఆహ్వానాన్ని ఇచ్చారు. నేను కూడా ఆయ‌నతో ‘నేను వస్తాను’ అన్నాను. ఆ మాట కోసం, మాల‌లో ఉన్నప్పటికీ, ఈ దర్గాకు వచ్చాను. ఇక్కడ రాబోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది” అన్నారు.