డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 20, 2025: హోండా కార్స్ ఇండియా ఓ బడా సర్థ్ బాంబు పేల్చింది! తమ సూపర్‌హిట్ SUV ఎలివేట్‌కి ఇప్పుడు మరింత స్టైలిష్, మరియు అగ్రెసివ్ అవతారం ఇచ్చింది – ఎలివేట్ ADV ఎడిషన్! హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించిన ఈ స్పెషల్ ఎడిషన్‌ను చూస్తే.. “ఇదే కదా యూత్ కావాల్సింది!” అనిపిస్తోంది.
నలుపు-నారింజ కాంబినేషన్‌తో రోడ్డుపై రారాజు లాగా కనిపించే ఈ కారు పూర్తిగా బ్లాక్-అవుట్ థీమ్‌లో ఉంటుంది. గ్లాసీ బ్లాక్ ఆల్ఫా-బోల్డ్ ప్లస్ ఫ్రంట్ గ్రిల్, ఆరెంజ్ హైలైట్స్‌తో హుడ్ డెకాల్, బ్లాక్ రూఫ్ రైల్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఆరెంజ్ ఫాగ్‌ల్యాంప్ గార్నిష్, ADV బ్యాడ్జింగ్ – ఇలా ప్రతి అంశం ఒక్కటే చెబుతోంది: BOLD.MOVE!
ఇంటీరియర్ కూడా అదిరిపోయింది! పూర్తి నలుపు క్యాబిన్, ఆరెంజ్ స్టిచింగ్, సీట్లపై ADV ఎంబాస్డ్ లోగో, బ్యాక్‌లిట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ గార్నిష్ (హోండాలోనే మొదటిసారి), ఆరెంజ్ ఏసీ నాబ్స్, గేర్ నాబ్ – ఒక్కమాటలో చెప్పాలంటే లోపల కూర్చుంటే రేసర్ ఫీల్!
ధరలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్)
- MT సింగిల్ టోన్ – ₹15.29 లక్షలు
- MT డ్యూయల్ టోన్ – ₹15.49 లక్షలు
- CVT సింగిల్ టోన్ – ₹16.47 లక్షలు
- CVT డ్యూయల్ టోన్ – ₹16.67 లక్షలు (ఏడీవీ ప్యాక్ ధర ఇందులోనే ఇన్‌క్లూడ్)

పవర్ & ఫీచర్స్ లో మార్పు లేదు
- అదే 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ (121 PS)
- 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ CVT (ప్యాడిల్ షిఫ్టర్స్‌తో)
- హోండా సెన్సింగ్ ADAS పూర్తిగా స్టాండర్డ్
- 6 ఎయిర్‌బ్యాగ్స్, LaneWatch కెమెరా, 458 లీటర్ల బూట్ స్పేస్, బెస్ట్-ఇన్-క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్
హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ & సేల్స్) కునాల్ బెహల్ మాటల్లో చెప్పాలంటే – “తెలంగాణ మాకు కీలక మార్కెట్. ఇక్కడి యూత్‌కు ఈ బోల్డ్ లుక్ ఖచ్చితంగా నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం. ఎలివేట్ ADV ఎడిషన్‌తో హోండా ఫ్యామిలీ మరింత పెద్దదవుతుంది!”

ఇప్పటికే బుకింగ్స్ షురూ అయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్ షోరూమ్‌ల్లో టెస్ట్ డ్రైవ్‌కి రండి.. ఈ బ్లాక్ బ్యూటీ మీద కూర్చుంటే దిగాలనిపించదు!

