డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్‌, మార్చి1,2026: సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుని, అడ్డగోలుగా వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు గురిచేసే ప్రైవేట్ ఫైనాన్సియర్ల పట్ల హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు.

అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ, బాధితుల ఆస్తులను బలవంతంగా రాయించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read this also..Souq-e-Deccan Expo Debuts in Gudimalkapur with 5,000+ Attendees..

ఇదీ చదవండి..అపోలో ఫార్మసీ1,000వ స్టార్ ను లాంఛనంగా ప్రారంభించిన ఉపాసన కొణిదెల..

వేధిస్తే విడిచిపెట్టం..

నగరంలో కొందరు ఫైనాన్సియర్లు లైసెన్సులు లేకుండానే వడ్డీ వ్యాపారం చేస్తున్నారని, అప్పు తీసుకున్న వారి నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని సీపీ తెలిపారు.

“అప్పు ఇచ్చిన దానికంటే రెట్టింపు వడ్డీ వసూలు చేయడమే కాకుండా, చెక్కులు, ఖాళీ పత్రాలను దౌర్జన్యంగా తీసుకోవడం చట్టరీత్యా నేరం” అని ఆయన స్పష్టం చేశారు.

పీడీ యాక్ట్‌ నమోదుకు వెనకాడం..

బాధితులను బెదిరించి, వారిని మానసిక క్షోభకు గురిచేస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపించే వారిపై పీడీ యాక్ట్‌ (PD Act) నమోదు చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు. బాధితులు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని, అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నామని ఆయన పేర్కొన్నారు.

అక్రమ వసూళ్లు..చక్రవడ్డీలు, భూముల కబ్జాలపై ప్రత్యేక నిఘా.

కఠిన చర్యలు.. లైసెన్స్ లేని ఫైనాన్సియర్లపై క్రిమినల్ కేసులు.

బాధితులకు భరోసా..వేధింపులు ఉంటే డయల్ 100 లేదా సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.