డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,8 అక్టోబర్ 2024: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్‌పే యాప్‌లో తమ ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్లకు తక్షణ రుణాలను అందించేందుకు, ఆ సంస్థతో ఐసీఐసీఐ బ్యాంకు భాగస్వామ్యం కట్టినట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్లు ఫోన్‌పే యాప్‌లో స్వల్పకాలిక క్రెడిట్ లైన్‌ను తక్షణంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ లైన్‌ను యూపీఐ లావాదేవీల కోసం సురక్షితంగా ,నిరాటంకంగా ఉపయోగించుకోవచ్చు. బ్యాంకు రూ. 2 లక్షల వరకు క్రెడిట్ లైన్‌ను 45 రోజుల రీపేమెంట్ వ్యవధితో ఆఫర్ చేస్తోంది.
పండుగ సీజన్ నేపథ్యంలో ఈ సదుపాయాన్ని ప్రకటిస్తూ, కస్టమర్లకు ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, హోటల్ బుకింగ్స్, బిల్లులు చెల్లింపులు వంటి ఖరీదైన వస్తువుల కొనుగోలు కోసం ఈ రుణాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు బ్యాంకు పేర్కొంది.
ప్రోడక్ట్ హెడ్ – పేమెంట్ సొల్యూషన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, నీరజ్ త్రల్షావాలా(Niraj Tralshawala) మాట్లాడుతూ, “ఐసీఐసీఐ బ్యాంకు పండుగ సీజన్ సందర్భంగా తన ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్లకు ఫోన్‌పే యాప్‌లో తక్షణ క్రెడిట్ లైన్‌ను యాక్టివేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా, కస్టమర్లకు స్వల్పకాలిక క్రెడిట్‌ను సులభంగా,నిరాటంకంగా అందించడం కోసం ఈ భాగస్వామ్యం ముందడుగు. ఇది మా కస్టమర్లకు వ్యక్తిగతీకరించిన బ్యాంకింగ్ అనుభూతిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది” అని తెలిపారు.
ఫోన్‌పే హెడ్ ఆఫ్ పేమెంట్స్, దీప్ అగ్రవాల్(Deep Agrawal) మాట్లాడుతూ, “ఫోన్‌పే యాప్‌లో స్వల్పకాలిక రుణాలను సులభంగా అందించడానికి ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా కస్టమర్లు ఫోన్‌పే యాప్‌లో పూర్తి డిజిటల్ యూజర్ అనుభవాన్ని పొందుతారు. యూపీఐపై క్రెడిట్ లైన్ అనేది ఒక వినూత్న ప్రోడక్టుగా దేశంలో రుణ లభ్యతను విస్తరించడంలో కీలక పాత్ర పోషించగలదు. ఈ భాగస్వామ్యం ద్వారా ఈ ప్రోడక్ట్ లభ్యతను గణనీయంగా పెంచడం కోసం ఫోన్‌పే నిరంతరం కృషి చేస్తోంది” అని అన్నారు.
ఈ క్రెడిట్ లైన్ వివిధ యూపీఐ పేమెంట్ అప్లికేషన్లలో ఇంటరాపరబుల్‌గా ఉంటుంది, అంటే కస్టమర్లు ఏదైనా యూపీఐ పేమెంట్ యాప్ ద్వారా లావాదేవీలు జరపగలుగుతారు.
ఫోన్‌పేపై క్రెడిట్ లైన్‌ను యాక్టివేట్ చేసేందుకు దశలు:
- మీ ఫోన్‌పే యాప్‌లో లాగిన్ కావాలి
- యాప్‌లో కనిపించే క్రెడిట్ యాక్టివేషన్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి
- ప్రోడక్ట్ ఫీచర్లు, చార్జీలను చూసుకుని, యాక్టివేషన్ కోసం ముందుకు సాగాలి
- అన్ని ఆథెంటికేషన్ దశలను పూర్తి చేయాలి
- క్రెడిట్ లైన్ ఆమోదించబడిన తర్వాత, కస్టమరు దాన్ని యూపీఐకి అనుసంధానించి, యూపీఐ పిన్‌ను సెట్ చేసి, యూపీఐ లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చు.