డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, 12 నవంబర్ 2024:సెమీకండక్టర్, చిప్ డిజైన్ రంగాలలో ప్రగతిశీల టెక్నాలజీ పరిజ్ఞానాన్ని అందించేందుకు, వి.ఎల్.ఎస్.ఐ విభాగానికి చెందిన మోసార్ట్ ల్యాబ్స్,ఐఐటీ భువనేశ్వర్ సంయుక్తంగా ఆధునిక డిప్లమా కోర్సును ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు సెమీకండక్టర్ టెక్నాలజీ, అనలాగ్, డిజిటల్ డిజైన్, డిజైన్ వెరిఫికేషన్, ఫిజికల్ డిజైన్, లేఅవుట్ డిజైన్, వ్యాలిడేషన్,టెస్ట్ వంటి విభాగాల్లో పరిశ్రమలకు సరిపడే నైపుణ్యాలను అందిస్తుంది.
నవంబర్ 5వ తేదీన ఈ ఒప్పందంపై ఐఐటీ భువనేశ్వర్ తరఫున డీన్ ప్రొఫెసర్ దినకర్, మోసార్ట్ ల్యాబ్స్ తరఫున సీఈఓ రాజేష్ గుప్తా సంతకాలుచేశారు.
ఈ డిప్లమా లాంచ్ ప్యాడ్, ఫౌండేషన్, స్పెషలైజేషన్ అనే మూడు మాడ్యూళ్లలో శిక్షణను అందిస్తుంది.
డిప్లమా ముఖ్యాంశాలు:
- పరిశ్రమ నిపుణులు,ఐఐటీ అధ్యాపకులచే శిక్షణ.
- ఆధునిక ఈ.డి.ఎ సాఫ్ట్వేర్‌లను ఉపయోగించి ప్రాక్టికల్ శిక్షణ.
ఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ డా. శ్రీపాద్ కర్మాల్కర్ మాట్లాడుతూ, “మోసార్ట్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన శిక్షణను అందిస్తాం,” అని తెలిపారు.
మోసార్ట్ ల్యాబ్స్ సీఈఓ రాజేష్ గుప్తా మాట్లాడుతూ, “ఈ హై క్వాలిటీ వి.ఎల్.ఎస్.ఐ శిక్షణా కార్యక్రమాన్ని రూపుదిద్దడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.
సీఐటిఓ డా. కృష్ణకాంత్ అవళూర్ మాట్లాడుతూ, “ఈ కోర్సు ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు, పరిశ్రమలో ప్రవేశించేందుకు సరైన మైలురాయిగా నిలుస్తుంది. దేశంలోని విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు,” అని పేర్కొన్నారు.
మరింత సమాచారం లేదా నమోదు కోసం మోసార్ట్ ల్యాబ్స్ వెబ్‌సైట్ ను చూడగలరు, లేదా admissions@mosartlabs.comకు ఈమెయిల్ చేయవచ్చు.