డైలీ మిర్రర్ డాట్ న్యూస్,అక్టోబర్ 2, 2024: ప్రపంచవ్యాప్తంగా 21 రకాల వైకల్యాలలో ఆటిజం ఒకటి. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు, ముందుగా రోగనిర్ధారణ చేయించి, అవసరమైన చికిత్సలు అందించినట్లయితే, వారు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. అయితే, సరైన సౌకర్యాలు, ప్రభుత్వ జోక్యం లేకపోవడం వల్ల, చాలా మంది పిల్లలు సరైన సమయానికి చికిత్స పొందడంలో విఫలమవుతున్నారు. దీని ఫలితంగా, వారు మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా వారి కుటుంబాలు మానసిక, శారీరక, ఆర్థికంగాను ఒత్తిడిపరంగా ఎదుర్కొంటున్నాయి.
వైద్య పరంగా ఉన్న ఈ గ్యాప్‌ను ఉపయోగించుకొని, నగరాలు, పట్టణాలలో అక్రమ చికిత్సా కేంద్రాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. అవసరమైన వనరులు, విద్యార్హతలు, ప్రభుత్వ లైసెన్సులు లేకుండానే అక్రమంగా ఆటిజం థెరపీ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో నాణ్యమైన చికిత్స అందించకవడంవల్ల చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయి.
డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ (DDEW) విభాగం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించకుండా, ఈ కేంద్రాలు ఆటిజం, ADHD, ఆలస్యం, ఇతర నాడీ సంబంధిత రుగ్మతలకు నాసిరకం చికిత్సలను అందిస్తున్నాయి. ఈ కేంద్రాలు సహాయం చేయడం బదులుగా మరింత హాని కలిగిస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“మా పిల్లలకు సరైన వైద్యం అందించి వారి జీవితాలు మెరుగుపరుస్తాయని ఆశతో ఈ కేంద్రాలకు వెళ్ళాము. కానీ వాస్తవానికి, ఇవి మమ్మల్నిమోసం చేస్తున్నాయి, ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయి, మా పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అనుమతులు లేని అక్రమ చికిత్సా కేంద్రాలను వెంటనే మూసివేయాలని, ప్రభుత్వానికి చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాలలో తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. “ఈ కేంద్రాలు మా పిల్లల ఆరోగ్యాన్ని, మా మానసిక శాంతి లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకుని, అక్రమ కేంద్రాలను మూసివేసి, లైసెన్స్ పొందిన సౌకర్యాలను మాత్రమే ఆపరేట్ చేయాలని కోరుతున్నారు.
అక్రమ ఆటిజం థెరపీ సెంటర్లు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నందున, ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని దోపిడీ నుంచి రక్షించాలని ప్రాధేయ పడుతున్నారు బాధితులు.
ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, బాధిత కుటుంబాలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.