డైలీమిర్రర్ డాట్ న్యూస్,జనవరి 15, 2025: భారతదేశంలో మొట్టమొదటి తనఖా గ్యారెంటీ సంస్థ అయిన ఇండియా మార్ట్‌గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్ (IMGC) ప్రముఖ జిఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (GIHFL) సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

ఈ భాగస్వామ్యం ద్వారా ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందిన వ్యక్తులకు తనఖా హామీ ఆధారిత గృహ రుణాలను అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ భాగస్వామ్యంపై IMGC చీఫ్ అలయన్స్ ఆఫీసర్ శ్రీమతి అకృతి సింగ్ మాట్లాడుతూ,
“మా కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడానికి GIHFLతో భాగస్వామ్యం చేసుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది.

ఈ భాగస్వామ్యం ఇంటి యాజమాన్యాన్ని అందరికీ సులభంగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రిస్క్ తగ్గిస్తూ రుణదాతల విలువను పెంచే కొత్త ఆవిష్కరణలకు ఇది దారితీస్తుంది” అని అన్నారు.

GIHFL ఎండి,సీఈఓ పాల్ లోబో మాట్లాడుతూ,
“మా కస్టమర్లకు వినూత్న తనఖా హామీ ఆధారిత గృహ రుణ సేవలు అందించేందుకు IMGCతో భాగస్వామ్యం చేసుకోవడం మాకు గర్వకారణం. మధ్య,తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు అందుబాటులో గృహ రుణాలను తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం” అని అన్నారు.

ఈ భాగస్వామ్యంపై GIHFL సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అచ్యుత మూర్తి సోంభట్ల మాట్లాడుతూ, “భారతదేశం అంతటా లక్షలాది మంది గృహ యజమానుల కలలను నిజం చేసుకోవటానికి ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి కలలను నెరవేర్చడంలో మా సేవలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయి” అని తెలిపారు.

ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు తమ గృహ రుణ అవసరాలను సులభతరం చేసుకోవచ్చు. తనఖా హామీ ఆధారిత రుణాల ద్వారా బడ్జెట్ స్నేహపూర్వక రుణాలు అందించి వినియోగదారుల ఆర్థిక భారం తగ్గించే అవకాశం ఉంది.