డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, మార్చి 26,2025: ప్రముఖ ఆభరణాల బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ తమ కొత్త అవుట్‌లెట్‌ను చందానగర్‌లో ప్రారంభించనుంది. మార్చి 28న ఉదయం 11:30 గంటలకు సూపర్ స్టార్ నాగార్జున ఈ షోరూమ్‌ను ప్రారంభించనున్నారు.

Read this also…81% of Indians Underinsured: Bajaj Allianz Life’s Underinsurance Survey 2025 Highlights Coverage Gaps

ఇది కూడా చదవండిచెరువుల అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్..

తెలంగాణ రాష్ట్రంలో బ్రాండ్‌కు ఇది 9వ షోరూమ్ కానుండగా, చందానగర్ సమీపంలోని గంగారాం శ్రీ రామ్ నగర్ కాలనీలో ఇది స్థాపించనున్నారు. కాండెరే బ్రాండ్‌ ఆభరణాలు కూడా ఇక్కడ లభించనున్నాయి.

ఈ సందర్భంగా కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, “తెలంగాణ మా బ్రాండ్‌కు ముఖ్యమైన మార్కెట్. చందానగర్ షోరూమ్‌తో మా కస్టమర్లకు మరింత మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు.

ఇది కూడా చదవండికొత్తకుంట చెరువు పరిస్థితిని పరిశీలించిన హైడ్రా కమిషనర్

షోరూమ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, వాల్యూ ఎడిషన్ పై 50% డిస్కౌంట్, అలాగే కళ్యాణ్ స్పెషల్ గోల్డ్ బోర్డ్ రేటు కూడా అందుబాటులో ఉంచారు. వినియోగదారులు 4-లెవల్ అష్యూరెన్స్ సర్టిఫికేట్ ద్వారా స్వచ్ఛత, జీవితకాల ఉచిత మెయింటెనెన్స్, పారదర్శక మార్పిడి, బై-బ్యాక్ పాలసీలను పొందవచ్చు.