డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 7, 2024: భారతదేశంలో అతిపెద్ద స్కూల్ ఎడ్యుటెక్ కంపెనీ లీడ్ గ్రూప్, సంప్రదాయ పాఠ్యపుస్తకాల్లోని అభ్యసన విధానాన్ని మార్చే విధంగా డిజైన్ చేయబడిన, ఇంటెలిజెంట్ పుస్తకం అయిన టెక్‌బుక్‌ను విడుదల చేసింది. టెక్‌బుక్, ఎన్‌సీఎఫ్ ఎలైన్ అయిన కరిక్యులంతో, లక్షలాది విద్యార్థులకు వ్యక్తిగతీకరించిన అభ్యసనాన్ని అందించడానికి మూడు ఆధునిక సాంకేతికతలను తీసుకొస్తుంది.
ఈ సందర్భంగా లీడ్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ సుమీత్ మెహతా మాట్లాడుతూ, “40 మంది విద్యార్థులతో కూడిన తరగతిలో ప్రతి విద్యార్థి యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చడం చాలా కష్టం. సాధారణ పాఠ్యపుస్తకాలు ఆ అవసరాలను తీర్చలేవు. అవి స్థిరంగా ఉంటాయి మరియు ప్రతి విద్యార్థికి ఒకే పాఠ్యపుస్తకం ఉంటుంది. కానీ టెక్‌బుక్ తో, మేము ప్రతి విద్యార్థి అభ్యసన ప్రయాణాన్ని అనుకూలీకరించడం ప్రారంభించాము. ఇది సాంకేతికత, బోధనా విధానం మరియు కరిక్యులం పరిశోధనల ఫలితంగా రూపొందించిన విప్లవాత్మక సాధనం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రగతిశీల పాఠశాలలకు ఈ టెక్‌బుక్ ను అందుబాటులోకి తెస్తున్నాము. దీంతో, తరగతులలో వ్యక్తిగతీకరించిన, ఇంటరాక్టివ్ లెర్నింగ్ సాధ్యమవుతుంది” అన్నారు.
“తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు కొత్త ఆవిష్కరణలను అంగీకరించడంలో ముందంజలో ఉన్నాయి. వచ్చే 3 సంవత్సరాలలో, ఈ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని టాప్ 500 పాఠశాలలతో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నాము. అలాగే, మరిన్ని పాఠశాలలకు సేవలు అందించడానికి శిక్షణ మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంచుతాము” అని సుమీత్ తెలిపారు.
టెక్‌బుక్, సంప్రదాయ పాఠ్యపుస్తకాల పరిమితులను అధిగమిస్తూ, వ్యక్తిగతీకరించిన మరియు ఇంటరాక్టివ్ అభ్యసన అనుభవాన్ని అందిస్తుంది. విభిన్న అభ్యసన స్థాయిలతో కూడిన తరగతులలో, టెక్‌బుక్ ప్రతి విద్యార్థికీ అనుకూలమైన బోధనను అందిస్తుంది. ఇది మూడు శక్తివంతమైన లక్షణాలను కలిగి ఉంది:
- ఆగ్మెంటెడ్ రియాలిటీ: 2D పాఠ్యపుస్తకాలు 3D స్వభావం కలిగిన సంక్లిష్ట భావనలను సులభంగా అర్థం చేసుకోవడంలో అడ్డంకి అవుతాయి. టెక్‌బుక్ ద్వారా సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులను 3D రూపంలో పొందవచ్చు.
- వ్యక్తిగతీకరించిన పఠన వేగం: భాషా అభ్యసన కోసం, టెక్‌బుక్ లోని IRA (ఇండిపెండెంట్ రీడింగ్ అసిస్టెంట్) విద్యార్థుల పఠనానికి అనుగుణంగా పని చేస్తుంది, వారి ఉచ్చారణను సరిదిద్దుతుంది మరియు వారి పఠన సరళతపై పర్సనలైజ్డ్ ఫీడ్ బ్యాక్ ఇస్తుంది.
- వ్యక్తిగతీకరించిన ప్రాక్టీసు: PIE (పర్సనలైజ్డ్ ఇంటరాక్టివ్ ఎక్సర్ సైజ్) ద్వారా, విద్యార్థులు అనుకూలంగా నిరంతరం వ్యాయామాలు చేయగలుగుతారు, తద్వారా వారు తమ స్వంత వేగంతో చదువుకునే అవకాశాన్ని పొందుతారు.
సుమీత్ మాట్లాడుతూ, “అభ్యసన రంగంలో కొత్త ప్రమాణాలు సృష్టించాలని, పాఠశాలల్లో కృత్రిమ మేధ, సాంకేతికతను విద్యార్థి-కేంద్రీకృతంగా జోడించాలనుకుంటున్నాము. పాఠ్యపుస్తకంలో ఉన్న స్పర్శ అనుభవాన్ని సాంకేతికత, శాస్త్రీయ విద్యా కంటెంట్ తో కలిపి, ప్రతి విద్యార్థికి అభ్యసనంలో కొత్త మార్గాన్ని చూపించాలనుకుంటున్నాం. టెక్‌బుక్ ద్వారా, విద్య అనేది జ్ఞాపకశక్తి కాకుండా, అన్వేషణ, సృజనాత్మకత, మరియు ప్రావీణ్యాన్ని ప్రేరేపించే ఒక ప్రక్రియగా మారుతుంది” అన్నారు.
“చదువు దేశ పురోగతికి ఆవశ్యకమైన పునాది. పాఠశాలలు ఈ మార్పుకు మూలధనంగా ఉంటాయి. టెక్‌బుక్ తో, మేము పాఠశాల విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలను ఎలా ఉపయోగించాలో కొత్త కోణంలో చూపించడానికి సిద్ధమవుతున్నాం. ఇది విద్యకు భవిష్యత్తు” అని ఆయన అన్నారు.
గత ఏడాది, లీడ్ గ్రూప్ అధిక ఫీజుల పాఠశాలల నుండి సాధారణ పాఠశాలల వరకు, దేశవ్యాప్తంగా అన్ని రకాల పాఠశాలలకు సేవలు అందించేందుకు తన సామర్థ్యాలను విస్తరించింది. 2028 నాటికి 60,000 పైగా పాఠశాలలకు అధిక నాణ్యత ఉన్న స్కూల్ ఎడ్యుటెక్ పరిష్కారాలను అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.