డైలీ మిర్రర్ డాట్ న్యూస్, ఏప్రిల్ 14, 2025 : హైదరాబాద్ హైటెక్ సిటీ గ్రీన్ హిల్స్ రోడ్‌లో సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విల్లా వెర్డే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 13, 2025న సాయంత్రం 7 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, అలాగే సైబర్ సిటీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్ మరియు ది చార్కోల్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు సుస్సేన్ ఖాన్ ఈ ప్రాజెక్టును ఆవిష్కరించి, విల్లా వెర్డేతో తమ సహకారాన్ని అధికారికంగా ప్రకటించారు.

సైబర్ సిటీ – 20 ఏళ్ల విజయ గాథ..


ఈ కార్యక్రమంలో సైబర్ సిటీ డెవలపర్స్ తన 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా సంస్థ పునాదినుంచి ఇప్పటి వరకూ సాగిన ప్రయాణాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియో రీల్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే 7,500 పైచిలుకు కుటుంబాలకు ఆకర్షణీయమైన గృహాలను అందించిన సైబర్ సిటీ, ఇప్పుడు విల్లా వెర్డే ద్వారా లగ్జరీ లివింగ్‌కు కొత్త నిర్వచనాన్ని ఇవ్వనుంది.

విల్లా వెర్డే విశేషాలు..


13.4 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో 89 ప్రత్యేకంగా రూపుదిద్దిన విల్లాలు ఉండనున్నాయి. ప్రతి విల్లా 300 నుంచి 440 గజాల పరిమాణంలో అందుబాటులో ఉంటుంది. అత్యద్భుతంగా రూపుదిద్దిన 100 అడుగుల ప్రవేశ ద్వారం, అలాగే 100 అడుగుల వెడల్పైన యాక్సెస్ రోడ్ ఈ ప్రాజెక్ట్‌కు వైభవాన్ని కలిగించాయి.

ప్రతి విల్లాలో కనీసం 3 కార్ పార్కింగ్ స్పేస్‌లు, టెరస్‌లో స్విమ్ స్పా, ఇంటర్నల్ ఎలివేటర్, 12 అడుగుల వెడల్పు ఔట్‌డోర్ డెక్స్, బయోఫిలిక్ డిజైన్, ప్యారామెట్రిక్ క్లబ్ హౌస్, IGBC గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్, రైన్ మ్యాక్స్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీ లాంటి అనేక అద్భుత లక్షణాలు ఉన్నాయి. అంతేకాకుండా, 1.4 ఎకరాల్లో విస్తరించిన కేంద్రపు ఓపెన్ స్పేస్‌తో పాటు 15కి పైగా ఇండోర్, 35కి పైగా అవుట్‌డోర్ సౌకర్యాలు లభించనున్నాయి.

విల్లా వెర్డే × చార్కోల్ ప్రాజెక్ట్ కలయిక..


విల్లా వెర్డే ప్రాజెక్టులో ది చార్కోల్ ప్రాజెక్ట్ భాగస్వామిగా మారి ప్రత్యేక ఇంటీరియర్ డిజైన్ ప్యాకేజీలను అందించనుంది. ఇవి ఆధునిక, కాంటెంపరరీ, ఎలిగెంట్ డిజైన్లతో విల్లా వెర్డే లక్షణాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.

భవిష్యత్తు ప్రణాళిక..


2025లో సైబర్ సిటీ డెవలపర్స్ విల్లా వెర్డేతో ప్రారంభమయ్యే మూడు అద్భుతమైన ప్రాజెక్టులతో తన 20 ఏళ్ల విజయాన్ని జరుపుకోనుంది. విలాసవంతమైన జీవనశైలికి పునరాయనమనించేలా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.