డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,9 అక్టోబర్ 2024: అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టాండెలోన్ ఆరోగ్య బీమా సంస్థ మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ కొత్తగా ‘ మణిపాల్‌సిగ్నా సర్వః’ పేరిట ఆరోగ్య బీమా పథకాన్ని ఆవిష్కరించింది. సర్వః అంటే అందరికోసం అని అర్థం కలిగిన ఈ పాలసీ ఒక సంపూర్ణమైన, సమగ్రమైన ఆరోగ్య బీమా పథకం. భారతదేశపు ‘మిస్సింగ్ మిడిల్’ జనాభాపై ప్రత్యేక దృష్టి పెట్టి, విస్తృతంగా వివిధ కస్టమర్ సెగ్మెంట్లకు అఫోర్డబుల్,సమ్మిళిత ఆరోగ్య కవరేజీని అందించడం దీని లక్ష్యం.
కమ్యూనికబుల్, నాన్-కమ్యూనికబుల్ మరియు లైఫ్‌స్టయిల్ అనారోగ్యాలనే మూడు రకాల అనారోగ్యాల భారంతో భారత పోరాడుతోంది. నీతి ఆయోగ్ రూపొందించిన ‘హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ ’ నివేదిక ప్రకారం జనాభాలో కనీసం 30 శాతం మంది, అంటే 35-40 కోట్ల మంది వ్యక్తులు తమ ఆరోగ్యానికి ఎటువంటి ఆర్థిక భద్రత లేకుండా ‘ది మిస్సింగ్ మిడిల్’ సెగ్మెంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీమా విస్తృతిని పెంచేందుకు, మిస్సింగ్ మిడిల్ సహా వివిధ రకాల కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు మణిపాల్‌సిగ్నా ‘సర్వః’ను ప్రవేశపెట్టింది. ఇది అనూహ్యమైన భారీ ఆరోగ్య వ్యయాల నుంచి రక్షణ కల్పించే సంపూర్ణమైన హెల్త్ ఇన్సూరెన్స్‌గా ఉంటుంది. తద్వారా కుటుంబాలు పేదరికంలోకి నెట్టబడకుండా కాపాడగలదు.
“కేవలం ఆరోగ్య బీమా అందించడంతోనే సరిపెట్టుకోకుండా హెల్త్‌కేర్ యాక్సెస్, అఫోర్డబిలిటీలో అంతరాలను పూడ్చేందుకు, ముఖ్యంగా భారత మిస్సింగ్ మిడిల్ వర్గాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ వినూత్నమైన సొల్యూషన్స్ అందించేందుకు మణిపాల్‌సిగ్నా కట్టుబడి ఉంది. ‘మణిపాల్‌సిగ్నా సర్వః’ అనేది వివిధ విభాగాల కస్టమర్ల అవసరాలను తీర్చడంతో పాటు ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే ప్రభుత్వ, రెగ్యులేటర్ విజన్‌ను సాకారం చేసే దిశగా భారతదేశపు మిస్సింగ్ మిడిల్ ఎదుర్కొంటున్న అఫోర్డబిలిటీ,యాక్సెసబిలిటీ సవాళ్లను కూడా వ్యూహాత్మకంగా పరిష్కరించగలిగే ఒక సంపూర్ణమైన ఆరోగ్య బీమా పథకం కాగలదు” అని మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో శ్రీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు.
“’ది మణిపాల్‌సిగ్నా సర్వః ట్రినిటీ’లోని ఒక్కో పథకం తగినంత కవరేజీనిస్తూ ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతూ అందరికీ అనంతమైన శక్తిని, తక్షణ మనశ్శాంతిని అందించే ప్రయోజనాలతో తీర్చిదిద్దబడ్డాయి. ‘మణిపాల్‌సిగ్నా సర్వః’ నాలుగు ప్రధాన అవయవాలకు సంబంధించిన అనారోగ్యాలకు అపరిమిత కవరేజీతో అనంత్ బెనిఫిట్‌ను అందిస్తుంది. గుల్లక్ అడ్వాంటేజ్ అనేది క్లెయిమ్‌లతో సంబంధం లేకుండా 1000% వరకు సమ్ అష్యూర్డ్‌కి భరోసానిస్తుంది. ఇక సారథి బెనిఫిట్ అనేది మధుమేహం, ఊబకాయం, ఆస్థమా, రక్తపోటు & కొలెస్టరాల్ వంటి ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధులకు 31వ రోజు నుంచే కవరేజీనిస్తుంది. ప్రజలు తమ నిర్దిష్ట ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా తగినంత స్థాయిలో కవరేజీని తీసుకోవడంలో ఇవి అర్థవంతమైన విధంగా సహాయపడగలవు” అని సిక్దర్ ధీమా వ్యక్తం చేశారు.
మణిపాల్‌సిగ్నా సర్వః మూడు విశిష్టమైన వేరియంట్స్‌లో లభిస్తుంది
· మణిపాల్‌సిగ్నా సర్వః ప్రథమ్:
o క్యాన్సర్, హార్ట్, స్ట్రోక్, మరియు ఇతరత్రా ప్రధాన అవయవాలు/బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్స్ మొదలైన వాటికి రూ. 3 కోట్ల వరకు సమగ్రమైన హాస్పిటలైజేషన్ కవరేజీని కస్టమర్లు పొందవచ్చు.
o మధుమేహం, హైపర్‌టెన్షన్, డిస్లిపిడీమియా, ఆస్థమా ,ఊబకాయం వంటి ప్రీ-ఎగ్జిస్టింగ్ అనారోగ్యాలకు సంబంధించి సాధారణంగా వర్తించే 36 నెలల వెయిటింగ్ పీరియడ్ బాదరబందీ లేకుండా 31వ రోజు నుంచే కవరేజీ మొదలయ్యేలా కస్టమర్లకు ఆప్షనల్ కవర్ ఉంటుంది.
· మణిపాల్‌సిగ్నా సర్వః ఉత్తమ్:
o ఆస్థమా, మధుమేహం, హైపర్‌టెన్షన్, ఊబకాయం, డిస్లిపిడీమియా వంటి ప్రీ-ఎగ్జిస్టింగ్ పరిస్థితుల కోసం 31వ రోజు నుంచి కవరేజీ పొందేలా ‘సారథి’ అనే ఆప్షన్‌తో పాటు పలు ఆప్షనల్ కవరేజీలతో సమగ్రమైన,అనుకూలీకరించిన కవరేజీని ఈ పథకం అందిస్తుంది.
o అనంత్ బెనిఫిట్ అనేది క్యాన్సర్, హార్ట్, స్ట్రోక్,ప్రధాన అవయవాలు/బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్స్ మొదలైన వాటికి సంబంధించి హాస్పిటలైజ్ అయితే అపరిమిత కవరేజీనిస్తుంది. ఇది రూ. 10 లక్షల పైబడిన బేస్ సమ్ ఇన్సూర్డ్‌తో లభిస్తుంది.
· మణిపాల్‌సిగ్నా సర్వః పరమ్:
o సర్వః పరమ్‌తో కస్టమర్లు మొదటి రోజు నుంచే, ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా ప్రీ-ఎగ్జిస్టింగ్ అనారోగ్యాలు,నిర్దిష్ట అనారోగ్యాలకు కవరేజీ పొందవచ్చు.
o ఈ ప్లాన్‌లో గుల్లక్ ఫీచరు కూడా ఉంది. కచ్చితమైన హామీతో ప్రతి సంవత్సరం ఆఖర్లో మీ బోనస్‌ను పోగు చేసి, క్లెయిమ్‌లతో సంబంధం లేకుండా వార్షికంగా 100% వరకు సమ్ అష్యూర్డ్ పెంపుతో, గరిష్టంగా 1000% (బేస్ సమ్ ఇన్సూర్డ్‌కి 10 రెట్లు) వరకు పెంపునిస్తుంది.
మణిపాల్‌సిగ్నా సర్వః అదనపు భద్రత,అనుకూలీకరణ కోసం వేల్యూ యాడెడ్, ఆప్షనల్ కవర్స్‌తో పాటు పలు ప్రయోజనాలను అందిస్తుంది.
· ‘సర్వః’లోని ప్రతి వేరియంట్ ఇటు ఆధునిక అటు అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్ల కోసం సమ్ ఇన్సూర్డ్ వరకు ఇన్-పేషంట్ హాస్పిటలైజేషన్ కవరేజీనిస్తుంది.
· అర్గాన్ డొనేషన్‌కి సంబంధించి 30 రోజుల వరకుప్రీ మరియు పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులు సహా అన్ని వ్యయాలకు అన్ని ప్లాన్లలో కవరేజీ ఉంటుంది. ఏడాదికొకసారి డోనర్ స్క్రీనింగ్‌కయ్యే వ్యయాలు, అవయవదానం వల్ల వచ్చే సమస్యలకు, సమ్ ఇన్సూర్డ్‌లో 25 శాతం లేదా రూ. 2 లక్షల వరకు (బేస్ సమ్ ఇన్సూర్డ్‌కి అదనంగా ఏది ఎక్కువైతే అది) కవరేజీ ఇందులో ఉంటుంది.
· ప్రతి పాలసీ సంవత్సరంలో సర్‌ప్లస్ బెనిఫిట్ అనేది అందుబాటులో ఉన్న సమ్ ఇన్సూర్డ్‌లో 100% మొత్తాన్ని 1వ క్లెయిమ్‌కి మాత్రమే మొదటి రోజు నుంచి అందిస్తుంది.
· అన్ని వేరియంట్స్ 90 రోజుల వరకు ప్రీ-హాస్పిటలైజేషన్ కవరేజీ, 180 రోజుల వరకు పోస్ట్-హాస్పిటలైజేషన్ కవరేజీని అందిస్తాయి.
· జనరల్ ఫిజీషియన్‌తో అపరిమిత టెలీ-కన్సల్టేషన్లు వంటి వేల్యూ యాడెడ్ ప్రయోజనాలు, హెల్దీ లైఫ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం కింద హెల్త్ యాక్టివిటీలను పూర్తి చేస్తే రివార్డులు మొదలైనవి కూడా ఈ ప్లాన్లు అందిస్తాయి.
· మణిపాల్‌సిగ్నా సర్వః ప్రథమ్, సర్వః ఉత్తమ్, సర్వః పరమ్ అన్నీ కూడా అదనపు ప్రయోజనాలతో రూ. 3 కోట్ల వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీని అందిస్తాయి.
· ఎర్లీ రెన్యువల్ డిస్కౌంటు – గడువు ముగియడానికి 30 రోజుల ముందే పాలసీని రెన్యువల్ చేస్తే కస్టమర్లకు రెన్యువల్ ప్రీమియంపై 2.5 శాతం డిస్కౌంటు లభిస్తుంది.
· ఫస్ట్ పాలసీ రెన్యువల్ డిస్కౌంటు – సర్వః ప్రథమ్,సర్వః ఉత్తమ్ ప్లాన్లకు సంబంధించి పాలసీని తొలిసారిగా రెన్యువల్ చేసినప్పుడు కస్టమర్లకు 5% డిస్కౌంటు లభిస్తుంది.
· ఒకే ఇండివిడ్యువల్ పాలసీ కింద లేదా మల్టీ-ఇండివిడ్యువల్ ప్రాతిపదికన 2 లేదా అంతకు మించి కుటుంబ సభ్యులకు కవరేజీ తీసుకుంటే 10% ఫ్యామిలీ డిస్కౌంటు లభిస్తుంది.