
డైలీమిర్రర్ డాట్ న్యూస్, సెప్టెంబర్ 27, 2024: ఎం అండ్ బీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (M&B Engineering Limited) తమ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. కంపెనీ తాజాగా షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 325 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో షేర్లను విక్రయించడం ద్వారా రూ. 328 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. మొత్తం ఇష్యూ పరిమాణం రూ. 653 కోట్లు కాగా, ఒక్కో షేరు ముఖ విలువ రూ. 10గా ఉంటుంది.
ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ వివిధ విధాలుగా వినియోగించుకోనుంది:
- తయారీ ప్లాంట్లలో యంత్ర పరికరాల కొనుగోలుకు సంబంధించి మూలధన వ్యయాల కోసం (రూ. 63 కోట్లు).
- నిర్దిష్ట రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించేందుకు (రూ. 60 కోట్లు).
- కంపెనీ నిర్వహణ మూలధన అవసరాల కోసం (రూ. 110 కోట్లు).
- మిగతా మొత్తాన్ని కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించుకోనుంది.
ప్రీ-ఇంజినీర్డ్ బిల్డింగ్స్ (పీఈబీ),సెల్ఫ్-సపోర్టెడ్ రూఫింగ్ సొల్యూషన్స్ విభాగంలో కంపెనీ భారత్‌లో అగ్రగామి సంస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. 2024 ఆగస్టు 31 నాటికి పీఈబీలకు సంబంధించి 1,03,800 ఎంటీపీఏ స్థాపిత సామర్థ్యం ఉంది. సెల్ఫ్-సపోర్టెడ్ రూఫింగ్‌కి సంబంధించి వార్షికంగా 1.8 మిలియన్ చ.అ. సామర్థ్యం ఉంది.
ఫుడ్ అండ్ బెవరేజెస్, వేర్‌హౌసింగ్,లాజిస్టిక్స్, పవర్ వంటి రంగాల్లో 1,700 పైచిలుకు కస్టమర్ గ్రూప్‌ల కోసం 8,700 పైగా ప్రాజెక్టులను కంపెనీ పూర్తి చేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ లాజిస్టిక్స్, ఏఐఏ ఇంజినీరింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా సెల్ఫ్-సపోర్టెడ్ స్టీల్ రూఫింగ్ సొల్యూషన్స్ విభాగంలో 75 శాతం మార్కెట్ వాటా కలిగిన అతి పెద్ద సంస్థగా నిలిచింది.
ఈ కంపెనీలో ప్రధానంగా రెండు విభాగాలున్నాయి: ప్రీ-ఇంజినీర్డ్ బిల్డింగ్స్ అందించే ఫీనిక్స్ డివిజన్ మరియు అధునాతన సెల్ఫ్-సపోర్టెడ్ స్టీల్ రూఫింగ్ సొల్యూషన్స్ అందించే ప్రొఫ్లెక్స్ డివిజన్. ఈ ఇష్యూకి ఈక్విరస్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్,DAM క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
డీఆర్‌హెచ్‌పీ లింకు దిగువన ఉంది.
https://www.damcapital.in/files/pdf/638628623927173169_M__B_Engineering_Limited_-_DRHP.pdf