డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22,2025: భారత మార్కెట్‌లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్‌ వాహనంగా గుర్తింపు పొందిన MG Comet EV ఇప్పుడు తన నూతన సంచిక BLACKSTORMతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. JSW MG మోటార్ ఇండియా సంస్థ ఆధునిక డిజైన్‌తో నిండి, శక్తివంతమైన ఫీచర్లతో కూడిన ఈ కొత్త ఎడిషన్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది.

ఈ వాహనం ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే బ్యాటరీ అద్దె విధానంలో (Battery-as-a-Service) తీసుకునే కస్టమర్లకు రూ.7.80 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరకు అందుబాటులో ఉంటుంది. బ్యాటరీ రెంటల్ రూ.2.5/కిలోమీటర్‌గా నిర్ణయించారు.

‘స్టారీ బ్లాక్’ లుక్‌తో ఆకర్షణకు కేంద్రబిందువై: BLACKSTORM ఎడిషన్‌లో స్టారీ బ్లాక్ ఎక్స్‌టీరియర్, రెడ్ అసెంట్స్‌తో ప్రత్యేక ఆకర్షణను కలిగిస్తోంది. అంతేగాక, లెదర్ సీట్లపై ‘BLACKSTORM’ ఎంబ్రాయిడరీ, నలుపు రంగులో ఇంటీరియర్ డిజైన్‌ ప్రత్యేకతను చాటుతున్నాయి.

ఇది కూడా చదవండి...భారత్‌లో వెల్త్ మేనేజ్‌మెంట్ సేవల విస్తరణకు 360 వన్ – యూబీఎస్ భాగస్వామ్యం..

పటిష్టమైన పనితీరుతో మైలేజీ: 17.4 kWh బ్యాటరీ సామర్థ్యంతో కూడిన ఈ కారు ARAI ధృవీకృతంగా 230 కిలోమీటర్ల పరిధిని అందించగలదు. అంతేగాక, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సామర్థ్యం కూడా కలిగి ఉంది. టెక్నాలజీ ప్రియుల కోసం ఇందులో 4 స్పీకర్లు అమర్చడం విశేషం.

విభిన్న యాక్సెసరీలతో వ్యక్తిగతీకరణ: వినియోగదారులు తమ BLACKSTORM ఎడిషన్‌ను స్పెషల్ బ్యాడ్జీలు, వీల్ కవర్లు, హుడ్ బ్రాండింగ్‌, స్కిడ్ ప్లేట్లతో ప్రత్యేకంగా మలచుకునే వీలుంది.

మార్కెట్లో వేగవంతమైన స్పందన: Comet EV ఇప్పటికే మార్కెట్లో మంచి స్పందనను పొందింది. గత ఏడాది CY’24లో అమ్మకాల్లో 29 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

Read this also…360 ONE WAM and UBS Forge Strategic Collaboration to Expand Wealth Management Offerings

ఈ సందర్భంగా MG హైదరాబాద్ డీలర్ ప్రిన్సిపల్ అభయ్ దుబే మాట్లాడుతూ, “Comet BLACKSTORM ఆధునిక స్టైల్, స్మార్ట్ టెక్నాలజీ, ప్రీమియం అనుభూతిని కలిపిన వాహనం. ఇది రోజువారీ ప్రయాణాల్లో వినియోగదారులకు విలువను కలిగించే తీరుతో అందరినీ ఆకట్టుకుంటుంది” అని పేర్కొన్నారు.