డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, మార్చి1,2026: తెలంగాణ ఫార్మసీ రంగంలో ప్రముఖ సంస్థ ‘అపోలో ఫార్మసీ’ అరుదైన మైలురాయిని చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తన స్టోర్ల సంఖ్యను వెయ్యికి చేర్చి సరికొత్త రికార్డు సృష్టించింది.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ చారిత్రక 1,000వ కేంద్రాన్ని అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో అపోలో తన ఔషధ సేవలను విస్తరించడం విశేషం.
పదివేల మందికి ఉపాధి..
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. అపోలో ఫార్మసీ కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక మార్పునకు నాంది పలుకుతోందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా మని, ముఖ్యంగా మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
24 గంటల పాటు అందుబాటులో ఉండే ఈ స్టోర్ల ద్వారా అత్యవసర ప్రాణరక్షక మందులను ప్రజలకు చేరువ చేస్తున్నట్లు తెలిపారు.

సాంకేతిక సేవలు.. విస్తరణ..
డిజిటల్ సాయం..‘అపోలో 24/7’ వేదికగా ఇంటి వద్దకే వైద్య సలహాలు, డయాగ్నస్టిక్ పరీక్షలు.
భారీ నెట్‌వర్క్..ప్రతిరోజూ సగటున 1.65 లక్షల ఔషధ ఆర్డర్ల డెలివరీ.భవిష్యత్ ప్రణాళిక.. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో మరో 200 కొత్త స్టోర్ల ఏర్పాటు. 50 వేలకు పైగా రకాల మందులు, ఆరోగ్య ఉత్పత్తులు సిద్ధం.
Read this also..ITC Master Chef Introduces Freshly Frozen Piri Piri Prawns for Seafood Lovers..
Read this also..Vasantha Panchami Grand Celebrations at Pallavi International School, Nanajipur..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా వినియోగదారులు అపోలోపై నమ్మకం ఉంచారని, పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ/సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనూ హోమ్ డెలివరీ సేవలను మరింత వేగవంతం చేస్తామని సంస్థ ప్రతినిధులు వివరించారు.

