
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై, 29ఆగస్టు 2024:పిరామల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (‘పీఈఎల్’) పూర్తి అనుబంధ సంస్థ అయిన పిరామల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (పిరామల్ ఫైనాన్స్),సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కో-లెండింగ్ వ్యాపారాన్ని విస్తరించే దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి.
ప్రధానంగా గ్రామీణ,సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని మధ్యస్థాయి, అల్పాదాయ రుణగ్రహీతల విభాగంపై ఫోకస్‌తో మధ్యస్థాయి, అల్పాదాయ రుణగ్రహీతలకు రుణాలు అందించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది.

ఆర్థిక రంగంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గల అపార అనుభవం, విస్తృత నెట్‌వర్క్‌ను అలాగే టెక్నాలజీ ద్వారా కస్టమరుకు నిరాటంకమైన సేవల అనుభూతిని అందించేందుకు పిరామల్ ఫైనాన్స్ పాటించే ‘హై టెక్ + హై టచ్’ వ్యూహాన్ని ఈ భాగస్వామ్యం ఉపయోగించుకోనుంది.
పిరామల్ ఫైనాన్స్‌కి భారత్‌వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో, 600 జిల్లాల్లో గల 500 పైచిలుకు శాఖల నెట్‌వర్క్ ద్వారా ఈ భాగస్వామ్యం, కొత్తగా రుణాలు తీసుకుంటున్న కస్టమర్లకు లేదా పెద్ద ఆర్థిక సంస్థల నుంచి పూర్తి స్థాయిలో సేవలు పొందలేని కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, కస్టమైజ్డ్ క్రెడిట్ సొల్యూషన్లను అందించేందుకు తోడ్పడనుంది.
ప్రధానంగా వైవిధ్యమైన, మల్టీ-ప్రోడక్ట్ లోన్‌బుక్‌ను రూపొందించుకోవడంపై ఇది దృష్టి సారిస్తుంది.

“గణనీయ చరిత్రతో, అత్యంత విశ్వసనీయమైనవిగా పేరొందిన ఆర్థిక సంస్థల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కో-లెండింగ్ భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అంతగా ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలకు (అండర్‌సర్వ్‌డ్) సంఘటిత రుణాలను అందుబాటులోకి తేవాలన్న మా ఉమ్మడి నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలవగలదు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విస్తృత నెట్‌వర్క్ అలాగే పిరామల్ ఫైనాన్స్ యొక్క పటిష్టమైన కార్యకలాపాలను ఉపయోగించుకోవడం ద్వారా భారత్‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మరింత లోతుగా సేవలను విస్తరించేందుకు ఇది తోడ్పడగలదు.
సంఘటిత రుణాలను అందుబాటులోకి తేవడం, వృద్ధికి తోడ్పడటం, భారత్‌వ్యాప్తంగా కస్టమర్లు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడంలో కలిసికట్టుగా తోడ్పాటు అందించడమనేవి మా లక్ష్యాలు” అని పిరామల్ క్యాపిటల్ & హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జైరామ్ శ్రీధరన్ తెలిపారు.

సాధారణంగా తగిన ఆదాయ ధృవీకరణ పత్రాలు లేనందున సంఘటిత రుణాలను పొందలేని స్వయం ఉపాధి వర్గాలు, వేతన జీవులు సహా అసంఘటిత రంగ కస్టమర్లకు సేవలందించాలనేది ఈ భాగస్వామ్య లక్ష్యం.
ఎంఎస్ఎంఈలు,గృహ రుణగ్రహీతలకు రుణాలు పొందడంలో ఎదురయ్యే సమస్యలను, పటిష్టమైన కస్టమర్ అవుట్‌రీచ్ అలాగే సమగ్ర క్రెడిట్ అండర్‌రైటింగ్,అసెస్‌మెంట్ సాధనాలతో పరిష్కరించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిరామల్ ఫైనాన్స్ ఉమ్మడి అనుభవం,విస్తృతి తోడ్పడనున్నాయి.
13 లక్షల మంది పైగా యాక్టివ్ కస్టమర్లకు సేవలు అందిస్తున్న పిరామల్ ఫైనాన్స్ ట్రాక్ రికార్డు అనేది భారత అండర్‌సర్వ్‌డ్ మార్కెట్లలో రిటైల్ రుణాల వితరణ మెరుగుపర్చడంలో సంస్థకు గల నిబద్ధతకు నిదర్శనంగా ఉండగలదు.
#PiramalFinance, #CentralBankOfIndia, #CoLendingPartnership, #FinancialInclusion ,#RuralFinance ,#SemiUrbanFinance, #MiddleIncomeBorrowers, #LowIncomeBorrowers, #FormalCreditAccess, #MSMEFinance, #HomeLoans, #BharatBanking, #RetailLending, #CreditSolutions, #UnderservedMarkets ,#FinancialPartnership, #InclusiveBanking, #IndiaBanking ,#CustomerExperience ,#DigitalLending ,#LoanBookDiversity,