డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై, ఏప్రిల్ 11, 2025: సైరస్ పూనావాలా గ్రూప్ ఆధ్వర్యంలోని ప్రముఖ ఎన్బీఎఫ్సీ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్) తాజాగా షాప్‌కీపర్ లోన్ పేరుతో కొత్త రుణ సేవను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రిటైలర్లు, కిరాణా దుకాణాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ సేవ అందుబాటులోకి తీసుకొచ్చారు.

చిన్న వ్యాపారుల క్యాష్ ఫ్లో, నిల్వల నిర్వహణ, కస్టమర్ అవసరాలు వంటి కీలక ఆర్థిక అంశాలపై ఫోకస్ చేస్తూ, వారిని ఆర్థికంగా స్వావలంబులుగా మార్చడం ఈ రుణ సేవ ప్రధాన ఉద్దేశం. వ్యాపార నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ఈ రుణం తోడ్పడుతుంది.

తొలి దశలో 44 ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభించనున్నట్లు పూనావాలా ఫిన్‌కార్ప్ తెలిపింది. దీంతో సంస్థ తాజాగా ప్రారంభించిన వ్యాపార సేవల సంఖ్య నాలుగుకు చేరింది.

ఈ సందర్భంగా పూనావాలా ఫిన్‌కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో అరవింద్ కపిల్ మాట్లాడుతూ –
“భారతదేశంలో చిన్న రిటైలర్లు మన కన్‌స్యూమర్ ఎకానమీకి కీలక బలం. కానీ సకాలంలో అవసరమైన ఆర్థిక మద్దతు అందకపోవడం వల్ల వారు ఎదగలేకపోతున్నారు.

ఈ లోటును తీర్చేందుకు, షాప్‌కీపర్ లోన్ ద్వారా సరైన ఆర్థిక సొల్యూషన్స్‌ను అందించాలనే సంకల్పంతో ముందుకొచ్చాం. దీర్ఘకాలికంగా వీరి వ్యాపార వృద్ధికి ఇది ఉపయోగపడుతుంది” అన్నారు.

మరిన్ని వివరాల కోసం పూనావాలా ఫిన్‌కార్ప్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.