డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, మార్చి 26,2025: గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ ఎన్నడూ లేనివిధంగా మ్యాజిక్‌ను క్రియేట్ చేయటానికి మరోసారి తిరిగి వచ్చాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16వ చిత్రాన్ని రామ్ చరణ్ సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. తొలి చిత్రం “ఉప్పెన”తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించబోతున్నారు.

ఈ పాన్-ఇండియా సినిమాటిక్ వండర్‌ను పవర్‌హౌస్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పిస్తోంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తూ నెక్ట్స్ రేంజ్ గ్రాండియర్ మూవీగా దీన్ని రూపొందించటానికి సుకుమార్ రైటింగ్స్ కూడా చేతులు కలిపింది.

Read this also…RC16 Pre-Look Unveiled: First Look of Ram Charan’s Pan-India Film Drops Tomorrow!

ఇది కూడా చదవండిచందానగర్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం

సినీ నిర్మాణ రంగంలోకి ఈ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు వెంకట సతీష్ కిలారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందనున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం. అన్‌కాంప్రమైజ్డ్ మేకింగ్‌తో స్క్రీన్‌పై సరికొత్త అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయనుంది వృద్ధి సినిమాస్.

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే అందరి అంచనాలకు తగ్గకుండా మేకర్లు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతోన్నారు.

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు అప్డేట్ ఇవ్వబోతోన్నారు. అయితే అంత వరకు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు.

రా అండ్ రస్టిక్, రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించబోతోన్నారు. చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్‌‌లో రేపు రామ్ చరణ్ దర్శనం ఇవ్వబోతోన్నారు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలానే బుచ్చిబాబు చూపించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. మాస్ పల్స్ తెలిసిన బుచ్చిబాబు రామ్ చరణ్‌ను మరింత రగ్డ్ లుక్‌లో చూపించబోతోన్నారని ఈ ప్రీ లుక్ పోస్టర్‌ను చూస్తేనే అర్థం అవుతోంది.

ఈ చిత్రంలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రఖ్యాత నటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి అకాడమీ అవార్డు గ్రహీత స్వరకర్త ఎఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అద్భుతమైన విజువల్స్‌ను ఆర్. రత్నవేలు ఐఎస్‌సి అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

Read this also…81% of Indians Underinsured: Bajaj Allianz Life’s Underinsurance Survey 2025 Highlights Coverage Gaps

ఇది కూడా చదవండికొత్తకుంట చెరువు పరిస్థితిని పరిశీలించిన హైడ్రా కమిషనర్

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తారాగణం: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు

సాంకేతిక సిబ్బంది
రచయిత, దర్శకుడు: బుచ్చిబాబు సానా
సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సంగీత దర్శకుడు: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్ల
PRO: వంశీ-శేఖర్, సురేంద్ర కుమార్ నాయుడు-ఫణి
మార్కెటింగ్: ఫస్ట్ షో