డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,ఆగస్ట్ 23, 2024:మనలో చాలా మంది కుటుంబానికి అత్యంత ప్రాధాన్యమిస్తాం. వారి మధ్య ఉన్నప్పుడు వారిని సంతోషంగా ఉంచేందుకు మనం చేయగలిగినంత చేస్తాం. అంతే కాదు, మనం లేకపోయినా వారు గౌరవప్రదమైన జీవితాన్ని సాగించడంలో సహాయకరంగా ఉండేలా అసెట్స్‌ను సమకూర్చి పెట్టేందుకు కూడా కృషి చేస్తాం.
ఇలాంటి సందర్భాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ సందర్భోచితమైన సొల్యూషన్‌గా ఉపయోగపడగలదు. దురదృష్టవశాత్తూ ఆదాయాన్ని ఆర్జించే ఇంటి పెద్ద మరణించిన పక్షంలో ప్రియమైన కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తును అందించే ప్రాథమిక అవసరాన్ని ఇది తీరుస్తుంది. అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఒక ఆర్థిక రక్షణ సొల్యూషన్ మాత్రమే కాదు. అంతకు మించి ప్రయోజనాలను అందించగలదు.
భారతదేశపు దిగ్గజ ఇన్సూరెన్స్ సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది వినూత్నమైన ఫీచర్లు, ప్రయోజనాలు ఉండే సరికొత్త టర్మ్ ఇన్సూరెన్స్ ‘సంపూర్ణ రక్ష ప్రామిస్’.
· కీలకమైన కుటుంబసభ్యులు మరణిస్తే ఆ కుటుంబానికి తక్షణం కొన్ని అత్యవసర ఖర్చులు ఉంటాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, క్లెయిమ్ గురించి ఇంటిమేషన్ వచ్చిన మీదట ఇది సత్వరం రూ. 3 లక్షల పేఅవుట్ చెల్లిస్తుంది*.
· కొన్ని సందర్భాల్లో వార్షిక ప్రీమియంలను సకాలంలో చెల్లించడంలో వినియోగదారుకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. అలాంటి సందర్భాల్లో ప్రీమియంను 12 నెలల పాటు వాయిదా వేసుకునేందుకు పాలసీదారుకు సంపూర్ణ రక్ష ప్రామిస్ వెసులుబాటు కల్పిస్తుంది.
· క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడినట్లు వైద్యపరీక్షల్లో తేలితే సమ్ అష్యూర్డ్‌లో 50 శాతం మొత్తం వినియోగదారుకు చెల్లించబడుతుంది. భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంల నుంచి మినహాయింపు లభిస్తుంది. కానీ పాలసీ ప్రయోజనాలు పోగుపడటం కొనసాగుతుంది.
సంపూర్ణ రక్ష ప్రామిస్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన టాటా ఏఐఏ ప్రెసిడెంట్ & చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీత్ ఉపాధ్యాయ్, “ఒక కేటగిరిగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేక సంవత్సరాలుగా వినియోగదారులకు ఆర్థిక భద్రత కల్పిస్తోంది. అయితే, తమ బీమా పాలసీ నుంచి సమర్ధమంతమైన క్లెయిమ్ పేమెంట్‌కు మించిన ప్రయోజనాలను కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.
మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు టాటా ఏఐఏ ఎల్లప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది. మా కొత్త టర్మ్ ఇన్సూరెన్స ప్లాన్, సంపూర్ణ రక్ష ప్రామిస్, వినూత్నమైన ఫీచర్లతో వినియోగదారుల నిర్దిష్ట అవసరాలను తీర్చే విధంగా ఉంటుంది.
క్లెయిమ్‌ను ఇంటిమేట్ చేసిన మీదట తక్షణ చెల్లింపు, డయాగ్నోసిస్ మీదట బేస్ సమ్ అష్యూర్డ్‌లో 50 శాతం చెల్లించేలా అంతర్గతంగా పొందుపర్చిన టర్మినల్ ఇల్‌నెస్ ప్రయోజనాలు మరియు భవిష్యత్ ప్రీమియంల చెల్లింపు నుంచి మినహాయింపు వంటి ప్రయోజనాలు ఈ ఫీచర్లలో ఉన్నాయి.
మా వినియోగదారులు ఫికర్-ఫ్రీగా (ఆందోళనరహితంగా) జీవితాన్ని గడిపేందుకు, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తయారుగా (సర్వసన్నద్ధంగా) ఉండేందుకు తోడ్పాటు అందించాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఈ కొత్త సొల్యూషన్ ఉంటుంది” అని వివరించారు.
సంపూర్ణ రక్ష ప్రామిస్ రెండు ప్లాన్ ఆప్షన్లతో 100 ఏళ్ల వరకు కవరేజీ ఇస్తుంది:
· లైఫ్ ప్రామిస్ – పాలసీని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు నిర్దిష్ట సమ్ అష్యూర్డ్‌ను ఎంచుకోవచ్చు. పాలసీదారు మరణానంతరం ఈ మొత్తం చెల్లించబడుతుంది.
· లైఫ్ ప్రామిస్ ప్లస్ – లైఫ్ ప్రామిస్ ఆప్షన్ తరహాలోనే డెత్ బెనిఫిట్స్ అందిస్తుంది. దానికి తోడు మెచ్యూరిటీ వరకు పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో మొత్తం ప్రీమియంలు (మోడల్ ప్రీమియంలు, డిస్కౌంట్లు మినహాయించి) 100 శాతం తిరిగి చెల్లించబడతాయి.
రెండు ఆప్షన్లలో పేయర్ యాక్సిలరేటర్ బెనిఫిట్ ఆఫర్ చేయబడుతుంది. దీని కింద టర్మినల్ ఇల్‌నెస్ క్లెయిమ్ చేసినప్పుడు బేస్ సమ్ అష్యూర్డ్‌లో 50 శాతం ఏకమొత్తంగా చెల్లించబడుతుంది.
అలాగే, క్లెయిమ్ పేమెంట్ చేసిన తర్వాత భవిష్యత్ ప్రీమియం చెల్లింపులన్నింటి నుంచి మినహాయింపు ఇవ్వబడుతుంది. ప్రయోజనాలతో కలిపి పాలసీ అలాగే కొనసాగుతుంది.
లైఫ్ స్టేజ్ బెనిఫిట్
ప్రోడక్టులో లైఫ్ స్టేజ్ సదుపాయం కూడా ఉంది. తమ జీవితంలోని వివిధ దశలు, అంటే వివాహం, పిల్లల జననం/దత్తత తీసుకోవడం లేదా హోమ్ లోన్ తీసుకోవడంలాంటి సందర్భాల్లో కవరేజీని పెంచుకునేలా పాలసీదారులకు దీని కింద వెసులుబాటు లభిస్తుంది. ఈ కింది సందర్భాలు చోటు చేసుకున్న 180 రోజుల వ్యవధిలోగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు:
వివాహం – 50%
1వ, 2వ సంతానం జననం / దత్తత: 25%.
గృహ రుణ వితరణ: 100%, మంజూరు చేయబడిన గృహ రుణ మొత్తాన్ని బట్టి.
3 పాలసీ సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ అనంతరం లైఫ్ ఇన్సూర్డ్ మరణించిన పక్షంలో క్లెయిమ్ రిజిస్టర్ చేసిన తేదీ నుంచి 1 పని దినంలోగా రూ. 3 లక్షల యాక్సిలరేటెడ్ ఇన్‌స్టంట్ డెత్ బెనిఫిట్ చెల్లించబడుతుంది. క్లెయిమ్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన మీదట మిగతా సమ్ అష్యూర్డ్ చెల్లించబడుతుంది.
ఫ్లెక్సి పే బెనిఫిట్ ఫీచర్ కింద పాలసీదారు, ప్రీమియంను చెల్లించాల్సిన గడువు తేదీ నుంచి 12 నెలల వరకు ప్రీమియం చెల్లింపును వాయిదా వేసుకోవచ్చు. ఈ వ్యవధిలో బేస్ ప్లాన్,సంబంధిత రైడర్ల కింద (ఏవైనా ఉంటే) పూర్తి రిస్క్ కవర్ కొనసాగుతుంది. ఈ ఫీచర్ కోసం అదనంగా ప్రీమియం ఏమీ చెల్లించనక్కర్లేదు.
ఈ కింద పేర్కొన్న డిస్కౌంట్లతో ఈ ప్రోడక్టు వివిధ వర్గాల కస్టమర్లకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది:
1. ఆన్‌లైన్‌లో పాలసీ కొనుగోలు చేస్తే తొలి ఏడాది ప్రీమియంపై 10% డిజిటల్ డిస్కౌంటు
2. శాలరీడ్ కస్టమర్లకు తొలి ఏడాది ప్రీమియంపై 5% డిస్కౌంటు
3. జీవితంలో నిర్దిష్ట మైలురాళ్లను చేరినప్పుడు తొలి ఏడాది ప్రీమియంపై 2% మేర విశిష్టమైన ‘మైల్‌స్టోన్ డిస్కౌంటు’. వివాహం, పిల్లల జననం/దత్తత, మొదటి ఉద్యోగంలో చేరడం, గృహ రుణం తీసుకోవడం వంటి మైలురాళ్లకు ఇది వర్తిస్తుంది.
4. పురుషులతో పోలిస్తే మహిళలకు 15% తక్కువ ప్రీమియం
వినియోగదారులు ప్రపంచ ప్రసిద్ధ మెడిక్స్ నుంచి పర్సనల్ మెడికల్ కేస్ మేనేజ్‌మెంట్ (పీఎంసీఎం) సర్వీసులను పొందవచ్చు. అక్రెడిటెడ్ వైద్య నిపుణులకు సంబంధించి స్థానిక, గ్లోబల్ నెట్‌వర్క్‌కు యాక్సెస్ పొందవచ్చు.
క్రిటికల్ ఇల్‌నెస్ పరిస్థితుల్లో వినియోగదారులు తమ ఆరోగ్య పరిస్థితులపై రెండో అభిప్రాయం పొందేందుకు, తగిన సంరక్షణ పొందేందుకు ఈ కాంప్లిమెంటరీ సర్వీసు సహాయకరంగా ఉంటుంది.