డైలీ మిర్రర్ డాట్ న్యూస్, జూన్ 2,2025: మలయాళ స్టార్ టొవినో థామస్ నటించిన తాజా కాప్ యాక్షన్ డ్రామా చిత్రం ‘నరివెట్ట’ మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో టొవినో నటించిన ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల హృదయాలను గట్టిగా తాకి భారీ ప్రశంసలు పొందుతున్నాయి. మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరోకు తెలుగులో కూడా బాగా గుర్తింపు లభిస్తోంది.

‘నరివెట్ట’ సినిమాను థియేటర్ల్లో చూసిన ఆడియన్స్ ఆ చిత్రంలోని భావోద్వేగానికి మునిగిపోతున్నారు. ఈ విషయాన్ని టొవినో థామస్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు ప్రారంభించారు. ప్రముఖ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా ఈ చిత్రం రానుంది.

టొవినో ఇటీవల ‘ఐడెంటిటీ’, ‘ఏఆర్ఎమ్’ వంటి చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు పోలీస్ థీమ్ ఆధారంగా వచ్చిన ‘నరివెట్ట’తో కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఈ సినిమాకు అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించగా, అబిన్ జోసెఫ్ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. సురాజ్ వెంజరమూడూ, చెరణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి, జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

‘నరివెట్ట’ తన ఎమోషనల్ డెప్త్, సుదీర్ఘ కాప్ట్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడ లభించబోతోంది.