
డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ఏప్రిల్ 21, 2025 : మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభాశాలి నటుల్లో ఒకరిగా గుర్తించబడిన టోవినో థామస్, తాజాగా 48వ ఉత్తమ నటుడు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు గెలుచుకున్నారు. ARM & అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రాలలో ప్రదర్శించిన అద్భుతమైన నటనకు ఈ అవార్డు లభించింది.
టోవినో థామస్ తన కెరీర్ ప్రారంభం నుంచి వివిధ రకాల పాత్రలలో తన అద్భుతమైన నటనతో సినీ ప్రేమికులను అలరించారు. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆయన, ప్రస్తుతం ప్రధాన పాత్రలలో మెరిసిపోతున్నాడు. తన పలు విజయవంతమైన చిత్రాలతో టోవినో ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోగా గుర్తింపు పొందారు.
Read this also…Pune Gas Unveils Telangana’s First ‘Pune Gas Experience Centre’ in Hyderabad
ఇటీవల, అతని నటనను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ARM & 2018 చిత్రాలు తైవాన్‌లో గోల్డెన్ హార్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఈ చిత్రాలకు విపరీతమైన స్పందన లభించింది.

ప్రస్తుతం, టోవినో మరిన్ని ప్రతిష్టాత్మక ప్రణాళికలతో, అనేక ఆసక్తికరమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. “మిన్నల్ మురళి”,”తల్లుమల్ల” వంటి చిత్రాలు అతనికి పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఇప్పటికే, సెప్టిమియస్ అవార్డ్స్ 2023లో ఉత్తమ ఆసియా నటుడిగా ఎంపికైన టోవినో, SIIMA, ఫిల్మ్‌ఫేర్,ఆసియానెట్ వంటి ప్రముఖ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
Read this also…OPPO India launches #LiveUnstoppable campaign for K13 5G; unleashes the ‘OverPowered Era’
ఈ కొత్త అవార్డు టోవినోకి మరింత విజయాన్ని ఇస్తోంది, ఆయన భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆశిస్తున్నాం.