డైలీ మిర్రర్ డాట్ న్యూస్,న్యూఢిల్లీ, 15 అక్టోబర్, 2024: భారతదేశంలోని సంస్థలకు తమ కస్టమర్లకు మెరుగైన అనుభవాలను అందించేందుకు సహాయపడే వినూత్నమైన ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించేందుకు Vi బిజినెస్, జెనిసిస్ అనే అంతర్జాతీయ దిగ్గజంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వొడాఫోన్ ఐడియా (Vi),వ్యాపార విభాగమైన Vi బిజినెస్, క్లౌడ్,టెలికం సొల్యూషన్స్‌ను అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది.
ఈ భాగస్వామ్యం కాంటాక్ట్ సెంటర్ యాజ్ ఏ సర్వీస్ (CCaaS) విభాగంలో Vi ప్రవేశానికి దారితీస్తుంది, తద్వారా వ్యాపార సంస్థలు తమ కాంటాక్ట్ సెంటర్ కార్యకలాపాలను అధునాతనంగా మార్చుకోవచ్చు. కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను మెరుగుపరచుకోవచ్చు. ఇది వారి అవసరాలను తీర్చేందుకు పెద్ద పెట్టుబడులు అవసరం లేకుండా వ్యక్తిగతీకరించిన, ఆమ్నిచానల్ అనుభవాలను అందించాలన్న లక్ష్యాన్ని కలిగి ఉంది.
ఈ భాగస్వామ్యాన్ని గురించి మాట్లాడుతూ, వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అరవింద్ నెవాతియా (Arvind Nevatia) అన్నారు, “జెనిసిస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నందుకు మాకు సంతోషం. వ్యాపార సంస్థలు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీని మరింత సమర్థంగా ఉపయోగించుకోవడానికి ఇది కీలకమైన ముందడుగు. భవిష్యత్ డిజిటల్ పరివర్తనకు సహాయపడేందుకు ఇరు సంస్థలు కట్టుబడి ఉన్నాయి.”
జెనిసిస్ ఏషియా-పసిఫిక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్విలిమ్ ఫనెల్ (Gwilym Funnell) మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యం వ్యాపార సంస్థలకు వివిధ మాధ్యమాలవ్యాప్తంగా నిరాటంకమైన ఇంటరక్షన్స్‌ను అందించడానికి ఉపయోగపడుతుంది. పటిష్టమైన Vi నెట్‌వర్క్, జెనిసిస్ ఏఐ ఆధారిత సాంకేతికతను కాంబైన్ చేయడం ద్వారా కస్టమర్ ఇంటరాక్షన్స్‌ను మెరుగుపరచడానికి మేము ఒక స్మార్ట్ సొల్యూషన్ అందించాలనుకుంటున్నాము” అని అన్నారు.
ఈ భాగస్వామ్యం ద్వారా Vi బిజినెస్ భారతీయ సంస్థల కోసం తదుపరి తరం క్లౌడ్ కాంటాక్ట్ సెంటర్ సొల్యూషన్స్‌ను అందించేందుకు కట్టుబడి ఉంది, తద్వారా వారు కస్టమర్ల అవసరాలకు తక్షణంగా స్పందించి, అధునాతన సాంకేతికతను అర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.