డైలీమిర్రర్ డాట్ న్యూస్,జనవరి 15, 2025: కీలక పరిశ్రమలు,అప్లికేషన్ల కోసం వైండింగ్, కండక్టివిటీ ఉత్పత్తులను తయారు చేసే అతి పెద్ద సంస్థల్లో ఒకటైన విద్యా వైర్స్ లిమిటెడ్, తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) కోసం ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సెబీకి సమర్పించింది.

ఈ ఐపీవోలో రూ. 320 కోట్ల విలువ చేసే కొత్త ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేయనుండగా, ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లు 10,000,000 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. ప్రతి ఈక్విటీ షేరు ముఖవిలువ రూ. 1 ఉంటుంది.

శ్యాంసుందర్ రాఠీ, శైలేష్ రాఠీ, శిల్పా రాఠీ ఈ కంపెనీ ప్రమోటర్లు.

ఓఎఫ్ఎస్ ద్వారా 10,000,000 షేర్లలో 5,000,000 షేర్లను శ్యాంసుందర్ రాఠీ, 5,000,000 షేర్లను శైలేష్ రాఠీ విక్రయించనున్నారు.

ఈ ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను కొత్త ప్రాజెక్ట్ కోసం అనుబంధ సంస్థ ALCUకి అవసరమైన నిధులను సమకూర్చేందుకు, కొన్ని రుణాలను చెల్లించేందుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది.

కేర్ఎడ్జ్ నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 5.9% మార్కెట్ వాటాతో విద్యా వైర్స్ లిమిటెడ్ పరిశ్రమలో 4వ అతి పెద్ద తయారీ సంస్థగా ఉంది. కంపెనీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో ప్రెసిషన్-ఇంజినీర్డ్ వైర్లు, ఎనామెల్డ్ కాపర్ రెక్టాంగులర్ స్ట్రిప్స్,ఇతర ఉత్పత్తులు ఉన్నాయి.

పాంటోమత్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ & సెక్యూరిటీస్ లిమిటెడ్ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.