డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ఇండియా,మార్చి 6,2026: ఏఐ -ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా ‘టుగెదహర్ ఫర్ టుమారో’ కార్యక్రమంను నిర్వహించింది.
మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్‌లో వెనుకబడిన వర్గాల కు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్‌లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం ‘గివ్ టు గెయిన్’ కు ప్రత్యక్ష వ్యక్తీకరణ గా ఈ కార్యక్రమం నిలిచింది.
ఇదీ చదవండి..రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ సీజన్ 4: మ్యూజిక్ & గేమింగ్ హంగామా షురూ!
ఇదీ చదవండి..కొచ్చి, బెంగళూరులలో హార్లే-డేవిడ్‌సన్ కొత్త డీలర్‌షిప్‌ల ప్రారంభం..
పంపిణీ చేయబడిన ప్రతి కిట్‌లో ప్రీమియం-నాణ్యత గల శానిటరీ ప్యాడ్‌లు, కాటన్ ఇన్నర్‌వేర్, ఫెమినైన్ వాష్, వెట్ వైప్స్, బయోడిగ్రేడబుల్ డిస్పోజల్ బ్యాగ్‌లు, ఒక చిన్న టవల్ , టూత్ బ్రష్ ,టూత్‌పేస్ట్ ఉన్నాయి – గౌరవం, శ్రేయస్సు , నిరంతరాయంగా పాఠశాల హాజరును ప్రోత్సహించడానికి ఇవి ముఖ్యమైనవి.
Read this also..S Saraswathi Review: Varalaxmi Sarathkumar Makes a Bold and Thought-Provoking Directorial Debut
ఇదీ చదవండి..సినిమా రివ్యూ: మిషన్ C1000..
క్వాలిజీల్ ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు, ఋతుక్రమ ఆరోగ్యం , వ్యక్తిగత పరిశుభ్రత గురించి సంభాషణలను సాధారణీకరించడం లక్ష్యంగా చిన్న అవగాహన సెషన్‌ల ద్వారా విద్యార్థులు , విద్యావేత్తలను దీనిలో భాగం చేశారు.

ఈ కార్యక్రమం గురించి క్వాలిజీల్ సహ వ్యవస్థాపకుడు & ఇండియా ఆపరేషన్స్ హెడ్ మధు మూర్తి రోనాంకి మాట్లాడుతూ, “గివ్ టు గెయిన్’ అనే నేపథ్యం క్వాలిజీల్ వద్ద మేము నిలబడే ప్రతి అంశంలోనూ లోతుగా ప్రతిధ్వనిస్తుంది.
ఈ రోజు యువతుల ఆరోగ్యం, గౌరవం, విశ్వాసం పెంపొందించటానికి మనం తోడ్పాటు అందిస్తున్నప్పుడు, బలమైన, మరింత సమానమైన రేపటికి పునాది వేయగలము. ‘టుగెదహర్ ఫర్ టుమారో’ అనేది ఆ నమ్మకాన్ని కార్యాచరణలోకి మార్చడానికి మాదైన మార్గం, దానికి జీవం పోయడానికి మార్పు ఫౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంతో పాటు, క్వాలిజీల్ W2EQ – ఉమెన్ హూ ఇంజనీర్ క్వాలిటీని ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది మహిళా ఇంజనీర్ల గొంతులను విస్తరించడానికి అంకితం చేయబడిన కొత్త మేధో సంపత్తి కార్యక్రమం.

