డైలీమిర్రర్ డాట్ న్యూస్, సెప్టెంబర్ 23,2024:భారతదేశంలో ఆరో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ , ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్‌లో అగ్రగామిగా ఉన్న యస్ బ్యాంక్, దక్షిణ భారతదేశంలో సూక్ష్మ, చిన్న,మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) వృద్ధి,నవీకరణకు కీలక పాత్ర పోషిస్తోంది.

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్‌కు ఆర్థికంగా ఊతమివ్వడంలో ఈ ప్రాంతంలోని ఎంఎస్ఎంఈలు, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ సంస్థలు దేశ జీడీపీకి గణనీయంగా మద్దతుగా నిలుస్తున్నాయి.

తమిళనాడులో 21.74 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, కర్ణాటకలో బెంగళూరు టెక్ ఆధారిత వ్యాపారాలకు గ్లోబల్ హబ్‌గా మారింది, కేరళలోని ఎంఎస్ఎంఈలు సర్వీస్ ,తయారీ రంగాలలో నడుస్తున్నాయి. భారత ఎంఎస్ఎంఈ రంగం 8.5% శాతం CAGRతో వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.

దక్షిణ భారత ఎంఎస్ఎంఈల నవీకరణకు దన్నుగా నిలబడాలనే సంకల్పంతో యస్ బ్యాంక్ విస్తృతమైన డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. ఎంఎస్ఎంఈలకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ట్రేడ్ ఫైనాన్స్ సొల్యూషన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ సాధనాలను యస్ ఎంఎస్ఎంఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం సులభంగా అందిస్తుంది. గ్లోబల్ ట్రేడ్‌ లావాదేవీలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈలకు ఈ ప్లాట్‌ఫాం కీలకంగా ఉంటుంది, ఎక్స్‌పోర్ట్ ఫైనాన్సింగ్‌కు నిరాటంకమైన యాక్సెస్ పొందడానికి సహాయపడుతుంది.

IT, తయారీ వంటి రంగాలలో దక్షిణ భారత పరిశ్రమల నేతృత్వ సామర్థ్యాలను గుర్తించి, వాటిని అంతర్జాతీయంగా పోటీపడేలా చేసేందుకు యస్ బ్యాంక్ అనుకూలమైన ఆర్థిక సాధనాలు అందిస్తోంది. కీలకమైన అంతర్జాతీయ టెక్ హబ్‌లుగా పేరొందిన బెంగళూరు ,చెన్నైలోని ఎంఎస్ఎంఈలు యస్ బ్యాంక్ అందించే వర్కింగ్ క్యాపిటల్ సొల్యూషన్స్, వెండార్ ఫైనాన్సింగ్, టెక్నాలజీ వినియోగ రుణాల నుండి ప్రయోజనం పొందుతున్నాయి.

నిర్దిష్ట రంగాలకు సంబంధించి కార్యకలాపాలను విస్తరించడం, సప్లై చెయిన్ సంక్లిష్టతలు వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సాధనాలు ఉపయోగపడుతున్నాయి.

దక్షిణాదిలో ప్రాంతీయ వైవిధ్యంపై యస్ బ్యాంకుకు లోతైన అవగాహన ఉంది. ఉదాహరణకు, టెక్స్‌టైల్స్ మరియు ఆటోమొబైల్స్ వంటి రంగాలలో తమిళనాడులోని తయారీ రంగం స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ ఉత్పత్తులను వినియోగిస్తుంది.

ఎక్కువగా సర్వీసులు, తయారీపై దృష్టి పెట్టే కేరళ ఎంఎస్ఎంఈలు, సంక్లిష్టమైన అంతర్జాతీయ వాణిజ్యంలో రాణించేందుకు అనుకూలీకరించిన రిస్క్ మేనేజ్‌మెంట్ సర్వీసులను అవసరమవుతాయి. గ్లోబల్ మార్కెట్లలో ఉండే రిస్కులను అధిగమించడంలో యస్ బ్యాంక్ అందించే ఫారిన్ ఎక్స్చేంజ్ సర్వీస్‌లు, సైబర్‌సెక్యూరిటీ సొల్యూషన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ప్రపంచమంతా సస్టెయినబిలిటీపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో, దక్షిణాదిలోని ఎంఎస్ఎంఈలకు గ్రీన్ ఫైనాన్సింగ్ అందించడంలో యస్ బ్యాంక్ అగ్రగామిగా నిలుస్తోంది. సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్ సొల్యూషన్స్‌ను ఉపయోగించే వ్యాపారాలకు ఈ బ్యాంక్ మద్దతు ఇస్తోంది.

వివిధ పరిశ్రమల్లో పర్యావరణహిత విధానాలను ప్రోత్సహిస్తూ, వ్యర్ధాల నిర్వహణ, ఎనర్జీ ఎఫీషియెన్సీ, సస్టైనబుల్ ఉత్పత్తి విధానాలకు రుణాలు అందించడమ ద్వారా ప్రాంతీయ ఎంఎస్ఎంఈల అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది.

“భారతదేశ జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా సుమారు 30%గా ఉంటుంది. ఎగుమతుల్లో 50%గా ఉంది. అయినప్పటికీ, అవి 33 ట్రిలియన్ డాలర్ల రుణ అంతరాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ పథకాలను వ్యాపారాలకు అందుబాటులోకి తేవడం, వాటికి అనువైన ఆర్థిక సొల్యూషన్స్ అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించే ఎంఎస్ఎంఈ సెల్ వంటి చొరవల ద్వారా యస్ బ్యాంక్ ఎంఎస్ఎంఈల వృద్ధికి తోడ్పడేందుకు కట్టుబడింది.

మా డిజిటల్ సప్లై చెయిన్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్, స్మార్ట్‌ఫిన్ (SMARTFIN), ఎంఎస్ఎంఈలకు కీలకమైన సమాచారాన్ని అందించి, ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా సహాయపడుతుంది. యస్ కిరణ్ ప్రోగ్రాం ద్వారా ఎంఎస్ఎంఈలు పునరుత్పాదక శక్తి సొల్యూషన్స్‌ను ఉపయోగించుకునేందుకు, దీర్ఘకాలిక వ్యయాలను తగ్గించుకునేందుకు, సుస్థిర విధానాలను పాటించేందుకు మేము సహాయపడుతున్నాం.

AI,ఆటోమేషన్ వంటి అధునాతన టెక్నాలజీలపై మేము కొనసాగిస్తూ, కొత్త శిఖరాలను అధిగమించడంలో ఎంఎస్ఎంఈలకు సహాయపడే లక్ష్యంతో, భారత ఆర్థిక వృద్ధికి మద్దతు అందించాలనేది మా ప్రాధమిక తలంపు” అని యస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రాజన్ పెంటాల్ తెలిపారు.

నవకల్పనలు, డిజిటల్ పరివర్తన,సస్టెయినబిలిటీపై దృష్టి పెడుతున్న యస్ బ్యాంక్, దక్షిణాది ఎంఎస్ఎంఈ రంగ సంస్థల భవిష్యత్తు అభివృద్ధిలో కీలక భాగస్వామిగా నిలవనుంది. ప్రాంతీయంగా ఎంఎస్ఎంఈ వ్యవస్థ వృద్ధి చెందే కొద్దీ, వ్యాపారాలు బాధ్యతాయుతంగా,సస్టెయినబుల్‌గా ఎదిగేలా, కొత్త డిజిటల్ సొల్యూషన్స్,గ్రీన్ ఫైనాన్సింగ్ సాధనాలతో సహాయపడుతూ, యస్ బ్యాంక్ కట్టుబడి ఉంది.

విశిష్టమైన ప్రాంతీయ ఆర్థిక పరిస్థితులపై లోతైన అవగాహనతో, దక్షిణ భారత ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయ వేదికపై మరిన్ని కొత్త శిఖరాలను అధిగమించేందుకు యస్ బ్యాంక్ తోడ్పాటునివ్వనుంది.