డైలీ మిర్రర్ డాట్ న్యూస్,మే 10,2026, హైదరాబాద్: నేటి సమాజంలో ప్రతికూల ధోరణులు పెరుగుతున్న తరుణంలో, పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను చేరువ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్‌) ప్రతినిధి హెచ్‌.జీ. గౌరంగ దాస్ ప్రభుజీ పేర్కొన్నారు. ‘కృష్ణావతారం పార్ట్-1: ది హార్ట్’ చిత్రాన్ని వీక్షించిన ఆయన, ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతి కుటుంబం తమ పిల్లలతో కలిసి చూడాల్సిన అద్భుత దృశ్యకావ్యం ఇదని ఆయన అభివర్ణించారు.విలువల వేదికగా వెండితెరసినిమాను వీక్షించిన అనంతరం ప్రభుజీ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి దివ్య లీలలను, ఆయన బోధనలను నేటి తరానికి అర్థమయ్యే రీతిలో వెండితెరపై ఆవిష్కరించిన చిత్ర బృందం కృషిని అభినందించారు. ప్రస్తుత కాలంలో వెండితెరపై హింస, ప్రతికూల అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇలాంటి సమయంలో భక్తి, నైతిక విలువలను పెంపొందించే ‘కృష్ణావతారం’ వంటి చిత్రాలు రావడం శుభపరిణామమని వెల్లడించారు.యువతకు దిశానిర్దేశంసినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమమని, దీనిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే యువత మనసులను సానుకూల దిశగా మళ్లించవచ్చని ప్రభుజీ అభిప్రాయపడ్డారు. మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని, మహోన్నతమైన కథలను పిల్లలకు పరిచయం చేసేందుకు ఈ చిత్రం ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు.కొనసాగనున్న మద్దతుచిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్నిచ్చేలా, ‘కృష్ణావతారం’ తదుపరి భాగాలు (పార్ట్ 2, పార్ట్ 3) నిర్మాణంలో కూడా తన వంతు సహకారాన్ని, ఆధ్యాత్మిక మద్దతును అందిస్తానని ఆయన ప్రకటించారు. దీనిపై చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుజీ ఆశీస్సులు తమ ప్రయాణానికి కొండంత అండనిచ్చాయని పేర్కొన్నారు.ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం.. భక్తి, సంగీతం మరియు భావోద్వేగాల కలయికతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.