డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 22, 2026: UPES డెహ్రాడూన్ , భారతదేశంలో ఒక ప్రసిద్ధి చెందిన మల్టీడిసిప్లినరీ ,రీసెర్చ్ యూనివర్శిటీ. ఇది ‘AI-First’ యూనివర్శిటీగా మార్పు చెందడం గురించి ఈరోజు హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించింది. ‘యూనివర్శిటీ ఆఫ్ టుమారో’ అనే తన కల గురించి UPES వివరించింది.
AI అనుసంధానం, లోతైన పరిశ్రమ సహకారం, పరిశోధనా శక్తి,ప్రతి విద్యార్థి యొక్క అభ్యాసనా ప్రయాణంలో కెరీర్ ఫలితాలపై ఇది రూపొందించబడింది. ఇంకా, కృత్రిమ మేధస్సులో కలుగుతున్న పురోగతులు, మారుతున్న నియామకం ధోరణులు, సాంకేతిక నాయకత్వంవహించే విద్య కోసం పెరుగుతున్న డిమాండ్ ఏ విధంగా ఇప్పుడు ఉన్నత విద్య నుండి విద్యార్థులు ఆశిస్తున్న అంశాలకు కొత్త రూపును ఇస్తున్నాయో UPES వివరించింది.
భారతదేశంలో ఉన్నత విద్యా రంగంలో ఒక చారిత్రాత్మకమైన తొలి చర్యగా, UPES OpenAI సహకారంతో పూర్తి క్యాంపస్ లో ChatGPT Eduను ఏర్పాటు చేసింది. ఈ ఏకీకరణ 19100 మందికి పైగా విద్యార్థులు ,1500 మందికి పైగా బోధనా సిబ్బందికి ఉచితంగా ,పరిమితులతో కూడిన AI టూల్స్ ను అందచేస్తుంది, ఇది అన్ని రంగాల్లో AI విజ్ఞానాన్ని ఒక ప్రాథమికమైన ఆధారంగా స్థాపిస్తుంది.
బోధన, అభ్యాసన, పరిశోధన మరియు విద్యార్థి అనుభవంలో ఫలితాలను మెరుగుపరచడానికి రూపొందించబడింది. విద్యార్థులు తమ డిగ్రీలో చేరిన మొదటి రోజు నుండే ప్రపంచ పరిశ్రమను కొత్త రకంగా రూపొందిస్తున్న అదే AI వాతావరణంలోనే స్వతంత్రంగా పని చేయడం అని దీని అర్థం. ఇది దేశవ్యాప్తంగా ఉన్నత విద్య అందచేయబడే విధానంలో పరివర్తనాపరమైన మార్పును సూచిస్తోంది.
సిబ్బంది చేసే పనిలో గణనీయమైన మార్పులు వేగవంతమవుతున్న సమయంలోనే సాంకేతిక విద్యకు గల డిమాండ్ పెరుగుతున్నప్పుడే ఈ విద్యాపరమైన మార్పు కలిగింది. తెలంగాణలో, TG EAPCET 2025లో, కంప్యూటర్ సైన్స్,ఐటి-సంబంధిత కోర్సులు 91% సీట్లను కేటాయించాయి (59,819 సీట్లు), ఇది వివిధ రంగాల్లో అత్యధికంగా నమోదైంది,AI, IoT మరియ సైబర్ భద్రత వంటి రంగాల్లో పెరుగుతున్న ఆసక్తితో ప్రేరేపించబడింది.
ఇదీ చదవండి..ఈ అక్షయ తృతీయ రోజున బంగారు ఆర్డర్లపై 49x పెరుగుదల చూసిన ఇన్స్టామార్ట్
Read this..ICAI Issues Warning Against Fake News on CA Examinations..
కేవలం 2025-2026లోనే, రాష్ట్రం AI & MLలో 12,000 కంటే ఎక్కువ సీట్లను,కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లలో 26,000 కంటే ఎక్కువ సీట్లను కేటాయించింది , ఇది భవిష్యత్తులో రాబోయే సాంకేతిక విద్య యొక్క డిమాండ్ స్థాయిని సూచిస్తోంది.
అయితే, నాణ్యమైన ఫలితాలు లేని డిమాండ్ సరిపోదు. ద ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ప్రకారం జాతీయ ఉపాధి అర్హత కేవలం 56.35%, కాగా తమ కార్యాలయాల్లో AI-ప్రేరేపిత అంతరాయం గురించి 86% భారతదేశపు ప్రొఫెషనల్స్ నివేదించారు.
విద్యార్థులు ఎంపిక చేస్తున్న విషయాలు , ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలు, గ్రాడ్యుయేట్లు ఎంత వరకు సిద్ధంగా ఉన్నారు అనే విషయాల మధ్య వ్యత్యాసం పెరుగుతోందని ఈ ధోరణులు తెలియచేస్తున్నాయి- ఈ అంతరాన్ని AI-First , పరిశ్రమకు అనుగుణంగా ఉన్న విద్యా నమూనా ద్వారా పూరించడానికి UPES ప్రయత్నిస్తోంది.
దీనికి ప్రతిస్పందనగా, వేగంగా పరిణామం చెందుతున్న ప్రపంచ శ్రామిక శక్తి (ఉద్యోగులు) యొక్క అవసరాలకు అనుగుణంగా సాంకేతికత, పరిశ్రమల సహకారం, వివిధ అంతర్ విభాగాల అధ్యయనం అనుసంధానం చేయడం ద్వారా విద్యా నమూనాను శక్తివంతం చేయడాన్ని UPES కొనసాగిస్తోంది.
తెలంగాణాలో కంప్యూటర్ సైన్స్,ఇంజనీరింగ్ (CSE) కోసం ఉన్న ఈ అత్యధిక డిమాండ్ యూనివర్శిటీ యొక్క స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ డ్ ఇంజనీరింగ్,స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ తో అనుసంధానం చెందింది, ఇది ఇప్పుడు AI, డేటా సైన్స్, సైబర్ భద్రత, క్లౌడ్, ఫుల్ స్టాక్, IoT,గ్రాఫిక్స్ , గేమింగ్ ప్రత్యేకతలతో 30కి పైగా AI- ఏకీకరణ ప్రోగ్రామ్స్ ను అందిస్తోంది.
ఈ విద్యాపరమైన కఠిన ప్రమాణాలకు ఉన్నతమైన ఫలితాలు కలిగిన పరిశోధన వ్యవస్థ మద్దతు ఇస్తోంది. దీనిలో భాగంగా స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ వారి ప్రతిష్టాత్మకమైన జాబితా ప్రకారం 50 మందికి పైగా UPES అధ్యాపకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2% అగ్ర పరిశోధకుల్లో భాగంగా గుర్తించబడ్డారు.
మారుతున్న ఉద్యోగ మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలను అందించడానికి ,ముఖ్యమైన సామర్థ్యాల లోపాలను పరిష్కరించడానికి UPES తన ప్రత్యేకమైన సహకారాల యొక్క శక్తివంతమైన వ్యవస్థను ప్రత్యేకంగా పేర్కొంది.
Read this..OnePlus Nord CE6 Series Launching May 7 with All-Rounder Performance and Extreme Durability
Read this..Medicover Experts Warn: Long-Term Antacid Use Linked to Bone Loss and Heart Issues
IBM,పలు ఇతర భాగస్వాములైన AWS, సిస్కో, Xebia , గూగుల్ GDG వంటి పలు ఇతర భాగస్వాములతో కలిసి యూనివర్శిటీ దశాబ్దం కాలంగా భాగస్వామ్యం కొనసాగించింది. దీని ద్వారా, ప్రత్యేకమైన సహ-బ్రాండెడ్ ప్రోగ్రాంలు నిపుణుల నాయకత్వంలోని నైపుణ్యాన్ని నేరుగా పాఠ్య ప్రణాళికలోకి తీసుకువస్తాయి.
ఇటీవల, ఇది బజాజ్ ఆటో సహకారంతో, BEST ( బజాజ్ ఇంజనీరింగ్ స్కిల్స్ ట్రైనింగ్) సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది. ఇది విద్యార్థులకు మెకాట్రోనిక్స్, రోబోటిక్స్, ఆటోమేషన్,ఇండస్ట్రీ 4.0లో ప్రత్యక్షమైన అనుభవం అందచేసింది.
ఈ పరిశ్రమ- అనుసంధానమైన విద్యా నమూనాను మరింత శక్తివంతం చేస్తూ, విద్యాపరమైన కఠినత్వాన్ని పరిశ్రమ-నిర్దిష్టమైన ఇన్ పుట్ లు,సర్టిఫికేషన్ లతో కలిపే సమిష్టిగా రూపొందించిన, సమిష్టిగా సృష్టించిన ,సమిష్టిగా అందించే అండర్ గ్రాడ్యుయేట్ ,పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ లను అందచేయడానికి UPES EY India,KPMG Indiaతో కలిసి పని చేస్తుంది.
డాక్టర్. జయశంకర్ వరియార్, ప్రో వైస్-ఛాన్స్ లర్, UPES, ఇలా అన్నారు: “విద్యా భవిష్యత్తుకు కేవలం నవీకరించబడిన పాఠ్యాంశం మాత్రమే కాకుండా, సాంకేతికత, పరిశ్రమలు, సమస్యల పరిష్కారంతో విద్యార్థులు నిమగ్నమయ్యే విధానంలోనే ఒక ప్రాథమికమైన మార్పు అవసరం.
ప్రతి విద్యార్థి ప్రయాణంలో AI అంతర్భాగంగా కలిసి ఉండే ఒక సంస్థను మేము ఉద్దేశ్యపూర్వకంగా రూపొందిస్తున్నాము. పరిశ్రమతో మాకు ఉన్న శక్తివంతమైన భాగస్వామ్యాలతో కలిసి, వేగంగా మారుతున్న వృత్తిపరమైన ప్రపంచంలో విజయవంతం చెందడానికి అవసరమైన నైపుణ్యాలు, అనుకూలత, ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పట్టభద్రులు అవడానికి మా AI-ఫస్ట్ విధానం రూపొందించబడింది.”
శ్రీ. రాజీవ్ నంద్వాని, సీనియర్ డైరెక్టర్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, UPES, ఇలా అన్నారు: “ నేటి విద్యార్థులు తమ ఉన్నత విద్యా ఎంపికల యొక్క స్పష్టమైన ఫలితాలపై మరింత ఎక్కువగా ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు.
శక్తివంతమైన విద్యా పరిజ్ఞానాన్ని, వాస్తవ ప్రపంచ సంబంధాన్ని సజావుగా చేసే ప్రోగ్రాంస్ పట్ల ప్రధానంగా AI,డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రేరేపిత వ్యాపార రంగాలు వంటి వాటిలో విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు.
UPESలో, మేము అర్థవంతమైన కెరీర్ మార్గాలను రూపొందించేందుకు సన్నిహితమైన పరిశ్రమ భాగస్వామ్యం, అత్యాధునిక సాంకేతికలు,వివిధ రంగాల సమగ్రమైన అభ్యాససను ఒక చోట చేర్చే భవిష్యత్తుకు సిద్ధమైన వ్యవస్థను రూపొందించాము.

హైదరాబాద్ వంటి కీలకమైన ప్రాంతాల్లో ఈ కలకు శక్తివంతమైన ఆదరణ లభిస్తోంది. నమోదవుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడం,UPESలో చేరడానికి నిపుణులైన బోధనా సిబ్బంది ఆసక్తి చూపించడం ఇందుకు రుజువుగా నిలిచాయి. ఈ విశ్వాసానికి తగిన ఫలితాలను నిరంతరం అందించడానికి మేము నిబద్ధతను కలిగి ఉంటాము.”
QS వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం భారతదేశంలో ప్రైవేట్ యూనివర్శిటీల్లో విద్యాపరమైన ప్రతిష్టలో UPES నంబర్ 1 ర్యాంక్ ను సంపాదించింది, అంతర్జాతీయంగా 501-600 శ్రేణిలో చేర్చబడింది. జాతీయంగా, ఇది NIRF 2025 యూనివర్శిటీ శ్రేణిలో 45వ ర్యాంకు సంపాదించింది, దీని ఇంజనీరింగ్ ప్రోగ్రాంస్ దేశంలో 43వ ర్యాంకును సంపాదించాయి.
ఈ ర్యాంకింగ్స్ గత అయిదు సంవత్సరాలకు పైగా100% ప్లేస్మెంట్ తో మద్దతు చేయబడ్డాయి. 2024-25 విద్యా సంవత్సరంలో, యూనివర్శిటీలో 800 మందికి పైగా నియామక సంస్థలు పాల్గొన్నాయి, దీనిలో అత్యధిక CTC విలువ రూ. 52 LPAకి చేరింది.
2026–27 విద్యా సంవత్సరం కోసం ప్రస్తుతం అన్ని ఏడు స్కూల్స్ లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.upes.ac.in

