డైలీ మిర్రర్ డాట్ న్యూస్,జాతీయ, ఏప్రిల్ 28, 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సంస్థ ‘క్లియర్‌ట్రిప్’.. రైలు టికెట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు ఈరోజు ప్రకటించింది. భారతీయ రైల్వేస్ అధికారిక టికెటింగ్ విభాగమైన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఐఆర్‌సీటీసీ యొక్క బలమైన మౌలిక సదుపాయాల మద్దతుతో, ఈ అనుసంధానం ద్వారా వినియోగదారులకు మరింత సులభమైన, నమ్మకమైన సేవలు లభించనున్నాయి. యాప్‌లోనే వినియోగదారులు తమ రైలు ప్రయాణాలను సులభంగా శోధించడానికి, బుక్ చేసుకోవడానికి, నిర్వహించుకోవడానికి క్లియర్‌ట్రిప్ అవకాశం కల్పిస్తుంది. ఒకే వేదికపై అన్ని రకాల ప్రయాణ సేవలను అందించే దిశగా ఇదొక కీలక ముందడుగు.
ఇదీ చదవండి :ఇంటర్ పూర్తయిన విద్యార్థుల కోసం ఎన్ఐఐటీ యూనివర్సిటీ ‘క్యాంప్ ఫ్యూచర్’
ఇదీ చదవండి :అబి శ్రీ సత్యం గుంటికి వరల్డ్ వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గౌరవం లభించింది..
ఈ లాంచ్‌తో.. రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం జనరల్,తత్కాల్ కోటాతో సహా భారతదేశవ్యాప్తంగా ఉన్న అన్ని మార్గాల్లో రైలు టిక్కెట్లను ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, రియల్-టైమ్ సీట్ల లభ్యత, టికెట్ ధరల వివరాలు, పీఎన్ఆర్ స్టేటస్ ట్రాకింగ్, బెర్త్ ప్రాధాన్యతలు, సురక్షితమైన డిజిటల్ చెల్లింపులు వంటి ముఖ్యమైన సేవలన్నీ ఒకే యాప్‌లో సులభంగా పొందవచ్చు.
క్లియర్‌ట్రిప్ చీఫ్ గ్రోత్ అండ్ బిజినెస్ ఆఫీసర్ మంజరి సింఘాల్ మాట్లాడుతూ.. “భారతదేశ రవాణా వ్యవస్థలో రైలు ప్రయాణానిది అత్యంత కీలక పాత్ర. అన్ని రకాల ప్రయాణాలకు ఒకే వేదికగా నిలవాలన్న మా లక్ష్యసాధనలో ఈ లాంచ్ ఒక ముఖ్యమైన అడుగు. ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యంతో, రైలు టికెట్ బుకింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేయడంపై, అలాగే కోట్లాది మంది ప్రయాణికులకు మా సేవలను చేరువ చేయడంపై మేము ప్రధానంగా దృష్టి సారించాము” అని అన్నారు.
Read this also..Mahindra Holidays & Resorts India Ltd.
Read this also..Abi Sri Satyam Gunti honnerd with world wonders book of record !!!
క్లియర్‌ట్రిప్ ఎయిర్ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గౌరవ్ పట్వారీ మాట్లాడుతూ.. “ప్రతి సంవత్సరం 800 మిలియన్లకు పైగా (80 కోట్ల మందికి పైగా) రిజర్వేషన్ ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇది కేవలం వ్యాపార విస్తరణకు సంబంధించిన అంశం మాత్రమే కాదు.. ప్రయాణికులకు ఒక విలక్షణమైన అనుభూతిని అందించడానికి దక్కిన అవకాశం.

ఎలాంటి అవాంతరాలు లేని బుకింగ్ అనుభవాన్ని, ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని, పర్సనలైజేషన్‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడం ద్వారా.. ప్రయాణానికి ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి బుకింగ్ పూర్తయ్యే వరకు ప్రతీ దశను అత్యంత వేగవంతంగా, నమ్మకంగా మరియు ఒత్తిడి లేకుండా ఉండేలా చూస్తున్నాము” అని పేర్కొన్నారు.
భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ 23 మిలియన్ల (2.3 కోట్ల) మంది, ఏటా 7 బిలియన్ల (700 కోట్ల) మంది ప్రయాణికులకు సేవలందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటిగా ఇది నిలుస్తోంది.
రైలు బుకింగ్‌లను కూడా తన సేవల్లో చేర్చడం ద్వారా ఈ భారీ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని క్లియర్‌ట్రిప్ లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు.. త్వరలో ఈ సేవలను తమ వెబ్ ప్లాట్‌ఫామ్‌కు కూడా విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది.

