డైలీ మిర్రర్ డాట్ న్యూస్,న్యూఢిల్లీ, 28 ఏప్రిల్ 2026: 12వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం ప్రముఖ విద్యాసంస్థ ‘ఎన్ఐఐటీ యూనివర్సిటీ’ రాజస్థాన్‌లోని తమ నీమ్రానా క్యాంపస్‌లో ‘క్యాంప్ ఫ్యూచర్’ పేరిట రెండు రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

విద్యార్థులు కళాశాలలో చేరకముందే.. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడంతో పాటు, సరైన కెరీర్ మార్గాన్ని ఎంచుకునేందుకు వీలుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.

ఇదీ చదవండి :అబి శ్రీ సత్యం గుంటికి వరల్డ్ వండర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గౌరవం లభించింది..

Read this also..Mahindra Holidays & Resorts India Ltd.

ఏప్రిల్ 25, 26 తేదీల్లో జరిగిన ఈ తొలి విడత క్యాంప్‌లో 200 మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. క్యాంపస్‌ను సందర్శించడంతో పాటు వర్సిటీ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధ్యాపకులు, సీనియర్ విద్యార్థులతో వారు ముచ్చటించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

హాస్టల్‌లో బస చేయడం, వర్సిటీ మెస్‌లో భోజనం చేయడం, క్యాంపస్‌లోని ప్రత్యేకమైన భూతాప కూలింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవడం వంటివి ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మే రెండో వారంలో తదుపరి విడత ‘క్యాంప్ ఫ్యూచర్’ జరగనుండగా, ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు యూనివర్సిటీలో అడ్మిషన్లు ఖరారు చేసుకోవడం విశేషం.

Read this also..Abi Sri Satyam Gunti honnerd with world wonders book of record !!!

ఇదీ చదవండి :రిటైర్మెంట్ అనంతరం భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా మీ ఆదాయం ఉంటుందా?

కళాశాలను, కోర్సును ఎంచుకోవడమే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అని, ఆ నిర్ణయాన్ని వారు ఆత్మవిశ్వాసంతో తీసుకునేందుకు ఈ ‘క్యాంప్ ఫ్యూచర్’ ఎంతో తోడ్పడుతుందని యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ప్రకాష్ గోపాలన్ అన్నారు.

ఆధునిక కోర్సులు.. ప్రాక్టికల్స్‌కే పెద్దపీట

మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్ఐఐటీ యూనివర్సిటీ సరికొత్త కోర్సులను అందిస్తోంది. బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, బయోటెక్నాలజీ, సీఎస్‌ఈ, ఈసీఈ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే బీబీఏ, బీబీఏ (ఏఐ), బిజినెస్ అనలిటిక్స్, 5-ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సులను సైతం అందిస్తోంది.

విద్యార్థులను నేరుగా ఉద్యోగాలకు సన్నద్ధం చేసేలా ప్రాక్టికల్ లెర్నింగ్‌కు వర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. బీటెక్ కోర్సుల్లో ఏకంగా 35% వెయిటేజీ ప్రాక్టికల్స్‌కే కేటాయించారు. ఇండస్ట్రీ ప్రాజెక్టులు, ఆరు నెలల ప్రత్యేక ఇండస్ట్రీ ప్రాక్టీస్, సమ్మర్ ఇంటర్న్‌షిప్‌ల ద్వారా విద్యార్థులకు పారిశ్రామిక నైపుణ్యాలను పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. (అడ్మిషన్ల వివరాలకు www.niituniversity.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు)