డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 27, 2026: చాలా మంది రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే పదవీ విరమణ అవసరాల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకోవడం మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి రిటైర్మెంట్ జీవితం ప్రారంభమైన తర్వాతే అసలు విషయం మొదలవుతుంది.
నిలకడగా వచ్చే పెన్షన్, కాస్త స్థిరత్వాన్ని ఇస్తుంది. కానీ పెరిగిపోయే జీవన వ్యయాలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చుల స్థాయికి అది సరిపోకపోవచ్చు. మరోవైపు, మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో ఇన్వెస్ట్‌మెంట్ వృద్ధికి ఆస్కారం ఉంటుంది, కానీ అనిశ్చితీ ఉంటుంది.
విషయం చాలా సింపుల్: పొదుపు మొత్తాలు వృద్ధి చెందేందుకు వీలు కల్పిస్తూనే జీవితకాలం పాటు స్థిరమైన ఆదాయం రావాలంటే ఏం చేయాలి?
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్న శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ అచ్చంగా ఈ సమస్యనే పరిష్కరించేదిగా తీర్చిదిద్దబడింది. మారే ఆర్థిక అవసరాలకు తగ్గట్లుగా రిటైర్మెంట్ వ్యూహాన్ని వేసుకోవడంలో సహాయకరంగా ఉండేలా, మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలతో జీవితకాలం పాటు కచ్చితమైన ఆదాయ భద్రతను కూడా మేళవించిన ఫ్లెక్సిబుల్ రిటైర్మెంట్ సొల్యూషన్‌గా ఇది ఉంటుంది.
భద్రత, వృద్ధి మధ్య సమతౌల్యత పాటించే పెన్షన్ పథకం
రిటైర్మెంట్ ఆదాయం అనేది స్థిరంగా ఉండటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని కూడా ఎదుర్కొనేందుకు తోడ్పడేలా ఉండాలనే ఆలోచనతో శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ రూపొందించబడింది.
- జీవితకాలం పాటు కచ్చితమైన ఆదాయం: రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థిక స్థిరత్వం ఉండేలా చూసేందుకు పాలసీదారు జీవించినంతకాలం ఈ ప్లాన్ ద్వారా యాన్యుటీ చెల్లింపులు లభిస్తాయి.
- మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలు: కాలక్రమేణా అధికాదాయాన్ని పొందే అవకాశాలు కల్పిస్తూ, యాన్యుటీలో కొంత భాగం, నిఫ్టీ 50 పనితీరుకు అనుగుణంగా ఉండేలా అనుసంధానించబడుతుంది.
- సరళతరమైన ఆదాయ స్వరూపం: కచ్చితంగా ఎంత మొత్తం ఆదాయం కావాలి, ఎంత భాగం మార్కెట్ పనితీరుకు అనుగుణంగా ఉండాలనేది కస్టమర్లు ఎంచుకోవచ్చు.
- కుటుంబానికి భద్రత: రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ ఆప్షన్ ఉండటం వల్ల ఒరిజినల్ పర్చేజ్ ప్రైస్‌ని నామినీలకు బదలాయించవచ్చు.
ఇందులో ప్రత్యేకత ఏంటంటే..
Read this also..Can your retirement income keep pace with the future..?
Read this also..Mahindra Holidays & Resorts India Ltd.
సంప్రదాయ యాన్యుటీ ప్లాన్లలో సాధారణంగా భద్రతపైనే ఫోకస్ తప్ప వృద్ధి అవకాశాలు పరిమితంగా ఉంటాయి. శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ మరింత సమతూకమైన విధానాన్ని పాటిస్తుంది.
- గ్యారంటీడ్ యాన్యుటీ ఆదాయాన్ని ఈక్విటీ ఆధారిత వృద్ధి అవకాశాలతో మేళవిస్తుంది
- గ్యారంటీడ్ ఆదాయానికి 60 శాతం – 90 శాతం వరకు, మార్కెట్ ఆధారిత ఆదాయానికి 10 శాతం-40 శాతం వరకు కేటాయించేందుకు వీలుంటుంది
- దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణం నుంచి రిటైర్మెంట్ ఆదాయానికి భద్రత ఉండేలా రూపొందించబడింది
హైబ్రిడ్ విధానం కావడం వల్ల ఈక్విటీ మార్కెట్ల వృద్ధి అవకాశాలతో ప్రయోజనం పొందుతూనే స్థిరత్వాన్ని కూడా పాటించేందుకు సహాయకరంగా ఉంటుంది.
వైవిధ్యమైన రిటైర్మెంట్ ప్రస్థానాలకు అనువు
ఇదీ చదవండి :ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఏఐ డిమాండ్.. 60 శాతం పెరిగిన నియామకాలు..
ఒకే రకమైన రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది అందరికీ సరిపోకపోవచ్చు. ఈ విషయాన్ని గుర్తించే, పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకునే విధంగా ఇందులో పలు ఆప్షన్లు ఉంటాయి.
- ముందుగానే ప్లానింగ్ ప్రారంభించాలి: 35 ఏళ్ల వయస్సు నుంచే రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రారంభించవచ్చు.
- ఇమ్మీడియెట్ లేదా డిఫర్డ్ ఆదాయం: యాన్యుటీ పేఅవుట్స్ తక్షణమే మొదలయ్యేలా ఎంచుకోవచ్చు లేదా రిటైర్మెంట్ నిధి పెరిగేందుకు వీలు కల్పిస్తూ 20 ఏళ్ల వరకు వాయిదా వేసుకోవచ్చు.
- సరళతరమైన ప్రీమియం ఆప్షన్లు: ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా 2 నుంచి 12 ఏళ్ల వరకు క్రమంగా చెల్లించవచ్చు.
తమ రిటైర్మెంట్ టైమ్‌లైన్, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడుల ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకునేందుకు కస్టమర్లకు ఇది అవకాశం కల్పిస్తుంది.

ఆధునిక రిటైర్మెంట్ అవసరాలకు అనువుగా తీర్చిదిద్దబడింది
వివిధ రకాల రిటైర్మెంట్ ప్లానింగ్ అవసరమయ్యే వారికి అనువుగా శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ ఉంటుంది:
- రిటైర్మెంట్ ప్రస్థానాన్ని ముందుగానే ప్రారంభించే యువ ప్రొఫెషనల్స్
- రిటైర్మెంట్ ముంగిట్లో ఉండి, ఊహించుకోతగిన విధంగా ఆదాయం ఉండాలని ప్లాన్ చేసుకుంటున్న వారు
- వృద్ధి అవకాశాలతో పాటు స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే రిటైరీలు
- రిటైర్మెంట్ ఆదాయం కోసం యాన్యుటీ ఆప్షన్లను పరిశీలిస్తున్న ఎన్‌పీఎస్ సబ్‌స్క్రయిబర్స్
ఆత్మవిశ్వాసంతో రిటైర్ అయ్యే దిశగా ముందడుగు
రిటైర్మెంట్ అనేది తమకు నచ్చిన పనులను చేసేందుకు, కుటుంబంతో గడిపేందుకు, ఆర్థిక అనిశ్చితి గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేకుండా సౌకర్యవంతంగా జీవించేలా ఉండాలి.
జీవితకాల ఆదాయ భరోసాతో మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను కూడా మేళవించడం ద్వారా, రేపటి ఆర్థిక పరిస్థితుల కోసం సన్నాహాలకు తోడ్పడుతూనే నేడు స్థిరత్వాన్ని అందించేలా, శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్ అనేది రిటైర్మెంట్ ప్లానింగ్‌కి సంబంధించి ఒక ఆధునిక పద్ధతిని పరిచయం చేస్తోంది.

