డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 25, 2026:విభిన్న రంగాలలో తమ సేవలను అందిస్తోన్న మురుగప్ప గ్రూప్ యొక్క క్లీన్ మొబిలిటీ బ్రాండ్ అయిన మోంట్రా ఎలక్ట్రిక్, ఈరోజు రెండు కొత్త EVIATOR వేరియంట్‌లైన EVIATOR 350 (32kWh) , EVIATOR 350L+ (50kWh).లను పరిచయం చేస్తూ, తన eSCV పోర్ట్‌ఫోలియోను వ్యూహాత్మకంగా విస్తరిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ విస్తరణకు వాస్తవ ప్రపంచ అనుభవం పునాది వేసింది. మోంట్రా ఎలక్ట్రిక్ యొక్క 600కు పైగా వాహనాల సముదాయం 65 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించడం వల్ల, కంపెనీకి విభిన్న డ్యూటీ సైకిల్స్‌ను అర్థం చేసుకోవడానికి, వివిధ వినియోగ పరిస్థితులలో ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలను ఎలా వినియోగించాలో పునర్నిర్వచించడానికి వీలు కలిగింది.
ప్రస్తుత 40kWh EVIATOR, ఈ శ్రేణిలో ఒక కీలక వాహనంగా కొనసాగుతుండగా, కొత్త 32kWh వేరియంట్‌ను 140 కిలోమీటర్ల వరకు అధిక సామర్థ్యంతో నడిపేందుకు ‘లాస్ట్ మైల్ ఛాంపియన్’గా రూపొందించారు. ఇది బ్రాండ్ యొక్క ప్రత్యేకమైన 99% అప్‌టైమ్‌పై రాజీ పడకుండా, మరింత సరసమైన ధరను అందిస్తుంది.
దీనికి విరుద్ధంగా, EVIATOR 350 L+ (50kWh) వేరియంట్‌ను ‘మారథాన్ రన్నర్’గా నిలబెట్టారు. ఇది ఈ విభాగంలోనే అత్యుత్తమ రీతిలో నిలిచే విధంగా 300+ కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను ,200+ కిలోమీటర్ల వాస్తవ ప్రపంచ రేంజ్‌ను అందిస్తుంది. ఇది నగరాల మధ్య లాజిస్టిక్స్,రీఫర్, మునిసిపల్ సేవల వంటి అధిక విద్యుత్ వినియోగం గల ప్రత్యేక అనువర్తనాల కోసం ఆందోళనను తొలగిస్తుంది.
జనవరి ’25లో విడుదల చేయబడిన EVIATOR 350L విజయం అందించిన స్పూర్తితో ఈ వ్యూహాత్మక విస్తరణ జరిగింది. ఇది మార్కెట్ లోకి వచ్చిన కేవలం 11 నెలల్లోనే 3.5-టన్నుల విభాగంలో 30% పైగా మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది.
మోంట్రా ఎలక్ట్రిక్ యొక్క ఈఎస్‌సివి (eSCV) దాని అసమానమైన రేంజ్,వినియోగదారుడికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే విధానం ద్వారా నడపబడుతోంది. ఈ విస్తరణతో, మోంట్రా ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ మొబిలిటీ విషయంలో ‘అందరికీ ఒకే విధానం’ అనే పద్ధతిని అధిగమించి, డ్యూటీ-సైకిల్,వినియోగ సందర్భాల ఆధారిత వాహన వ్యూహాన్ని ప్రవేశపెడుతోంది.
ఇదీ చదవండి :ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఏఐ డిమాండ్.. 60 శాతం పెరిగిన నియామకాలు..
దీని వల్ల ఫ్లీట్ ఆపరేటర్లు, అధిక ఫ్రీక్వెన్సీ గల పట్టణ మార్గాల నుండి తీవ్రమైన అంతర్-నగర లాజిస్టిక్స్ వరకు, తమ ఖచ్చితమైన కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లను ఎంచుకోవచ్చు.
ఇది ఉత్పత్తి ప్రామాణీకరణ నుండి అప్లికేషన్-నిర్దిష్ట విద్యుదీకరణ వైపు ఒక మార్పును సూచిస్తుంది. ఇది వినియోగదారులకు అప్‌టైమ్‌ను గరిష్ఠంగా పెంచుకోవడానికి, మొత్తం యాజమాన్య వ్యయాన్ని మెరుగుపరుచుకోవటానికి, మరియు విశ్వాసంతో కార్యకలాపాలను విస్తరించుకోవడానికి వీలు కల్పిస్తుంది.
మోంట్రా ఎలక్ట్రిక్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జలజ్ గుప్తా మాట్లాడుతూ, “ఈవీల స్వీకరణలో తదుపరి దశ కేవలం ఉత్పత్తుల ద్వారా మాత్రమే కాకుండా, అవి వాస్తవ ప్రపంచ కార్యకలాపాలలో ఎంత తెలివిగా ఇమిడిపోతాయనే అంశంపై ఆధారపడి ఉంటుంది.
ఇదీ చదవండి :ఏఐ విప్లవంతో ఆసుస్ కొత్త ల్యాప్‌టాప్‌లు: ‘ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా’ ఆవిష్కరణ!
మోంట్రా ఎలక్ట్రిక్ వద్ద, వివిధ వ్యాపారాలు తమ వాహనాలను ఎలా ఉపయోగిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి, మేము ప్రత్యేకంగా మా 600కు పైగా ఎవియేటర్ వాహనాల నుండి సేకరించిన 65 లక్షల కిలోమీటర్లకు పైగా ఫ్లీట్ డేటాను ఉపయోగించుకున్నాము. ఇది డ్యూటీ-సైకిల్ ఆధారిత ఉత్పత్తి వ్యూహం వైపు పయనించడానికి మాకు వీలు కల్పించింది.
దీని ద్వారా వినియోగదారులు అప్‌టైమ్, సామర్థ్యం,పెట్టుబడిపై రాబడిని నేరుగా మెరుగుపరిచే కాన్ఫిగరేషన్‌లను ఎంచుకోగలిగే పూర్తి వ్యాపార పరిష్కారాలను అందిస్తున్నాము. ఎలక్ట్రిక్ మొబిలిటీని కేవలం ఆచరణీయంగానే కాకుండా వాణిజ్య వినియోగాలకు సైతం విస్తరించగలిగేలా చేయడంలో ఇది ఒక కీలకమైన ముందడుగు. ఇది కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతూ, లాజిస్టిక్స్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది” అని అన్నారు.
మోంట్రా ఎలక్ట్రిక్ (ఇ-ఎస్‌సివి డివిజన్) సీఈఓ శ్రీ సజు నాయర్ మాట్లాడుతూ, “ఇ-ఎస్‌సివి విభాగంలో EVIATOR ఇప్పటికే అప్‌టైమ్,పనితీరులో బెంచ్‌మార్క్‌లను నెలకొల్పింది. ఈ కొత్త వేరియంట్‌ల పరిచయంతో, లాస్ట్-మైల్ సామర్థ్యం నుండి లాంగ్-హాల్ స్థిరత్వం వరకు విస్తృత శ్రేణి లాజిస్టిక్స్ అవసరాలను తీర్చడానికి మేము ఈ ప్లాట్‌ఫామ్‌ను విస్తరిస్తున్నాము.
ఇది ఫ్లీట్ ఆపరేటర్లకు ఈవీలను మరింత కచ్చితత్వంతో వినియోగించడానికి, కొత్త వినియోగ సందర్భాలను ఆవిష్కరించడానికి, మొత్తం ఫ్లీట్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు పరివర్తనను వేగవంతం చేస్తుంది” అని అన్నారు.

మూడు విభిన్న బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లతో (32kWh, 40kWh,50kWh), అప్లికేషన్-నిర్దిష్ట ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన భారతదేశంలోని ఏకైక ఎలక్ట్రిక్ ఎస్‌సివి ప్లాట్‌ఫామ్‌గా EVIATOR నిలుస్తుంది, ఈ విభాగంలో ఫ్లెక్సిబిలిటీ , నిర్వహణ కచ్చితత్వం కోసం ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పుతుంది.
కొత్త EVIATOR త్వరలో అన్ని మోంట్రా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, వినియోగదారులు తమ టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్ (ROI)ను తగ్గించే వేరియంట్‌ను ఎంచుకోవడంలో సహాయపడటానికి, అన్ని డీలర్‌షిప్‌లు సమగ్ర పోలిక డేటాతో సన్నద్ధమయ్యాయి.
EVIATOR శ్రేణిని వ్యూహాత్మకంగా ధర నిర్ణయించడం జరిగింది; ఇది నగరాల లోపలి వినియోగ సామర్థ్యం నుండి నగరాల మధ్య ప్రయాణ పనితీరు వరకు ఒక స్పష్టమైన పురోగతిని అందిస్తుంది, తద్వారా వినియోగదారులు తమ నిర్వహణ మరియు ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే మోడళ్లను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
EVIATOR శ్రేణిలో, 32 kWh వేరియంట్ ధర ప్రారంభ ఆఫర్‌గా రూ. 14.58 లక్షలు,50 kWh వేరియంట్ ధర రూ. 16.86 లక్షలుగా నిర్ణయించబడింది.

