డైలీ మిర్రర్ డాట్ న్యూస్,న్యూఢిల్లీ, ఏప్రిల్ 25, 2026: ప్రముఖ టెక్ దిగ్గజం ఆసుస్ (ASUS), భారత మార్కెట్లోకి సరికొత్త కృత్రిమ మేధ (AI) ఆధారిత బిజినెస్ ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది. చింత లేని వ్యాపార అనుభవం (Worry-Free Business) లక్ష్యంగా ‘ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా’ (ExpertBook Ultra) ,’ఎక్స్‌పర్ట్‌బుక్ పి-సిరీస్’ (ExpertBook P Series) మోడళ్లను విడుదల చేసింది.

ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా: అత్యంత తేలిక.. అత్యంత శక్తివంతం..
ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా కేవలం 0.99 కిలోల బరువుతో, ఈకంత తేలికగా ఉండి ప్రయాణాల్లో ఉన్నత శ్రేణి నిపుణులకు (CXOs) ఎంతో అనువుగా ఉంటుంది. దీని ప్రత్యేకతలు:

బిల్డ్ క్వాలిటీ: ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో తయారైంది.

పనితీరు: సరికొత్త ఇంటెల్ కోర్ అల్ట్రా (సిరీస్ 3) ప్రాసెసర్, శక్తివంతమైన GPU , AI కోసం ప్రత్యేకంగా NPUలను కలిగి ఉంది.

ఇదీ చదవండి :విజయవంతంగా స్ట్రింగ్ మెటావర్స్ ‘ఓఎఫ్ఎస్’.. బోనస్ జారీపై బోర్డు పరిశీలన..

ఇదీ చదవండి :“మళ్ళీ వచ్చేసిన ఒరిజినల్స్: యెజ్డీ, BSAల నుంచి రెండు అద్భుతమైన కొత్త స్క్రాంబ్లర్ల విడుదల!”

డిస్‌ప్లే: 14 అంగుళాల 3K 120Hz టాండమ్ OLED టచ్‌స్క్రీన్, 1400 నిట్స్ ప్రకాశంతో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.

బ్యాటరీ: ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 26 గంటల వరకు పనిచేస్తుంది.

ఎక్స్‌పర్ట్‌బుక్ పి-సిరీస్: స్టార్టప్‌లు,మధ్యతరహా వ్యాపారాల కోసం
చిన్న, మధ్యతరహా వ్యాపారాల (SMBs) అవసరాల కోసం ‘పి3’ మరియు ‘పి5’ మోడళ్లను ఆసుస్ అందుబాటులోకి తెచ్చింది. ఇవి యూఎస్ మిలిటరీ-గ్రేడ్ (MIL-STD 810H) మన్నికను కలిగి ఉండి, అత్యంత భద్రతను అందిస్తాయి.

Read this..Zee Telugu Summer Entertainment Bonanza: World Television Premiere of ‘Akhanda 2’ on April 26 at 5:30 PM

Read this..Godrej Industries Announces New Purpose and Brand Identity; Sets Rs.5,00,000 Crore Ambition by 2031..

ధర అండ్ లభ్యత
ఎక్స్‌పర్ట్‌బుక్ అల్ట్రా: దీని ప్రారంభ ధర ₹2,39,990. ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 22 నుండి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.

ఎక్స్‌పర్ట్‌బుక్ పి3: దీని ప్రారంభ ధర ₹94,990.

ఎక్స్‌పర్ట్‌బుక్ పి5: ఈ శ్రేణి త్వరలో ₹2,14,990 ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుంది.

ప్రీ-ఆర్డర్ ఆఫర్స్ ..

ఏప్రిల్ 29 లోపు ప్రీ-ఆర్డర్ చేసుకున్న వినియోగదారులకు ₹12,000 పైగా విలువైన 5 ఏళ్ల వారంటీ ప్యాక్, బ్యాంక్ కార్డులపై ₹20,000 వరకు అదనపు తగ్గింపు,ఇతర ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లభిస్తాయి.

“భారతదేశంలో ఏఐ-ఆధారిత విప్లవానికి నాయకత్వం వహించడం మాకు గర్వకారణం. దార్శనిక నాయకులకు ఎటువంటి ఆటంకాలు లేని పనితీరును అందించడమే మా లక్ష్యం,” అని ఆసుస్ గ్లోబల్ కో-సీఈఓ శామ్సన్ హు పేర్కొన్నారు.