డైలీ మిర్రర్ డాట్ న్యూస్, ఆంధ్రప్రదేశ్, 5 మే 2026 : కార్యాలయ, విద్యా ఫర్నిచర్ పరిష్కారాల పరంగా భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే సంస్థలలో ఒకటైన ఫెదర్‌లైట్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమ సరికొత్త, ప్రత్యేక అనుభవ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించింది.
విజయవాడతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలలోని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయ రూపకల్పన అనుభవాలను పునర్నిర్వచించాలనే ఫెదర్‌లైట్ లక్ష్యంలో ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
ఇదీ చదవండి :IQOSకు అమెరికా ఎఫ్‌డీఏ (FDA) ఊరట: ‘తక్కువ ప్రమాదకర’ ఉత్పత్తిగా పునరుద్ధరణ..
ఇదీ చదవండి :నోవోర్బిస్ సీడ్ ఫండింగ్: ₹13.35 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఇటస్, రెయిన్‌మ్యాటర్..
ఈ కేంద్రాన్ని 2026 మే 5న, ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పరిపాలన,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వివాటెక్ డైరెక్టర్ శ్రీ ఎస్. విజయ్ శ్రీ రామ్, వివాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విశాల్ సిద్ధంశెట్టి, ఫెదర్‌లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ కిరణ్ ధీరెన్ చెల్లారం,ఫెదర్‌లైట్ గ్రూప్ డీలర్ మేనేజ్మెంట్ – బిజినెస్ హెడ్ శ్రీ నిరంజన్ డి. దేశాయ్ కూడా పాల్గొన్నారు.
ఫెదర్‌లైట్ గ్రూప్ అసోసియేట్ డైరెక్టర్, శ్రీ కిరణ్ ధీరేన్ చెల్లారం మాట్లాడుతూ “విజయవాడలోని మా కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్‌తో, కార్పొరేట్లు, విద్యా సంస్థలు, చిన్న వ్యాపార యజమానులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ రంగ ప్రతినిధులకు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.
ఇదీ చదవండి :‘కృష్ణావతారం’ ట్రైలర్‌పై నాగార్జున ప్రశంసలు: రాధగా సుశ్మిత భట్ నటనకు ఫిదా..
ఇదీ చదవండి :టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తోంది‘శుభ్ హెల్త్ క్రిటీ’: మీతో పాటే పెరిగే హెల్త్ ఫండ్
ప్రతి ఒక్కరూ ఈ అనుభవ కేంద్రాన్ని సందర్శించి, మా అత్యాధునిక డిజైన్లను పరిశీలించడంతో పాటుగా కార్యస్థల ఆవిష్కరణల భవిష్యత్తును ప్రత్యక్షంగా అనుభవించాలని మేము ఆహ్వానిస్తున్నాము” అని అన్నారు.

విజయవాడలో ఉన్న ఈ 5,500 చదరపు అడుగుల అనుభవ కేంద్రం, ఫెదర్‌లైట్ యొక్క కార్యాలయ, విద్యాసంబంధిత పరిష్కారాల పూర్తి శ్రేణిని ప్రదర్శిస్తుంది. వీటిలో ఎర్గోనామిక్ సీటింగ్ , సహకార కార్యాలయ ఏర్పాట్లు నుండి సాంకేతిక ఆధారిత తరగతి గది ఫర్నిచర్, లేబరేటరీ బెంచీలు, లైబ్రరీ సిస్టమ్‌లు, ఆడిటోరియం సీటింగ్ , ప్రభుత్వ సంస్థల కోసం సంస్థాగత పరిష్కారాల వరకు ఉంటాయి.
నేడు మారుతున్న పని, అభ్యాస సంస్కృతికి అనుగుణంగా తీర్చిదిద్దిన ఆధునిక, అనుకూలమైన ఫర్నిచర్‌ను వాస్తుశిల్పులు, కార్పొరేట్ నాయకులు, పారిశ్రామికవేత్తలు,కొనుగోలు బృందాలకు ప్రత్యక్షంగా, విస్తృత స్థాయిలో పరిచయం చేసేలా ఈ కేంద్రం రూపొందించబడింది.

