డైలీ మిర్రర్ డాట్ న్యూస్,ముంబై,ఏప్రిల్ 29, 2026: చాలా మంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే జీవిత బీమా లేదా హెల్త్ కవరేజీ గురించి ఆలోచిస్తారు. కానీ ప్లాన్ చేసుకోవాలంటే అప్పటికే చాలా ఆలస్యమైపోయి ఉంటుంది. అయితే, జీవిత బీమా పాలసీ మీరు ఆరోగ్యంగా ఉండేలా చూడటమే కాకుండా అదే సమయంలో డబ్బును కూడా పెంపొందించుకోవడంలోనూ మీకు సహాయకరంగా ఉంటే ఎలా ఉంటుంది?ఈ వినూత్న ఆలోచనతోనే టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ‘శుభ్ హెల్త్ క్రిటీ’ (Shubh Health Criti) పేరుతో సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
ఇది దేశంలోనే మొదటి ‘యూనిట్-లింక్డ్ హెల్త్ ఫండ్’ ప్లాన్. దీని ద్వారా మీరు ఆరోగ్య అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక ఫండ్‌ను నిర్మించుకోవచ్చు. ఇది మార్కెట్ ఆధారిత రాబడులను అందించడమే కాకుండా, 60కి పైగా తీవ్రమైన అనారోగ్యాలకు రక్షణ కల్పిస్తుంది. అత్యవసర చికిత్స సమయంలో ఈ ఫండ్ నుండి పన్ను భారం లేకుండా నగదును విత్ డ్రా చేసుకునే సదుపాయం కూడా ఉంది. మరిన్ని వివరాల కోసంwww.tataaia.comవెబ్‌సైట్‌ను చూడవచ్చు.
Read this also..Tata AIA Life Insurance Introduces Shubh Health Criti: Where Your Health Fund Grows With You..
Read this also..Godrej Launches India’s First Face Recognition Enabled Home Locker and Smart Connected Solutions via digital locks
ఇది పాలసీ మాత్రమే కాదు.. ఒక ఫండ్‌లాంటిది
శుభ్ హెల్త్ క్రిటీ బీమా రంగంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కేవలం జబ్బు పడినప్పుడు మాత్రమే డబ్బులు ఇచ్చే పద్ధతికి భిన్నంగా, పాలసీదారులు తమ పెట్టుబడిపై మార్కెట్ ఆధారిత రాబడిని పొందుతూ హెల్త్ ఫండ్‌ను పోగు చేసుకోవచ్చు. తీవ్రమైన అనారోగ్యాలు లేదా శస్త్రచికిత్సల సమయంలో ఈ ఫండ్ నుండి పన్ను మినహాయింపుతో డబ్బు వాడుకోవచ్చు. ఈ ప్లాన్ కింద 60కి పైగా అనారోగ్యాలకు కవరేజీ ఉంటుంది.
ఇందులో ప్రీమియం ధరలు 30 ఏళ్ల వరకు మారకుండా ఉంటాయి (లాక్-ఇన్). ఒకవేళ పాలసీదారుడు మరణించినా లేదా వైకల్యానికి గురైనా, భవిష్యత్తు ప్రీమియంలను చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఫండ్ వృద్ధి చెందుతూనే ఉంటుంది. కవరేజీ సౌలభ్యం, అర్హత నిబంధనలు, వెల్‌నెస్ ప్రోగ్రాంల వివరాలను www.tataaia.comవెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Read this also..Sachin Tendulkar & Schneider Electric Transform Guhir Village..
ఇదీ చదవండి :స్టార్ హెల్త్ రికార్డ్ లాభం: FY26లో రూ. 911 కోట్లు నమోదు..
రక్షణ మాత్రమే కాదు.. వ్యాధి నిరోధకతపైనా దృష్టి
టాటా ఏఐఏ యొక్క ‘హెల్త్ బడ్డీ’ (Health Buddy) నెట్‌వర్క్ అనేది శుభ్ హెల్త్ క్రిటీలో మరో ప్రత్యేకత. క్యాన్సర్ స్క్రీనింగ్‌లు, సాధారణ హెల్త్ చెకప్‌లు మరియు వ్యక్తిగత హెల్త్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అంటే జబ్బు వచ్చాక స్పందించడం కంటే, రాకముందే అప్రమత్తంగా ఉండేలా ఈ ప్లాన్ రూపొందించబడింది. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు మరియు స్ట్రోక్ వంటి వాటిని ముందుగా గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వాటికి అనుగుణంగానే’హెల్త్ బడ్డీ’ సేవలుఉంటాయి.
“సాధారణంగా ఆరోగ్య ప్రణాళికలు అనేవి ఏదైనా సమస్య వచ్చాక మాత్రమే ఉపయోగపడేలా ఉంటాయి. కానీ ‘శుభ్ హెల్త్ క్రిటీ’ ఆ పద్ధతిని మారుస్తోంది. ఇది మీరు నిర్మించుకునే ఫండ్, మీ భవిష్యత్తు కోసం చేసుకునే ప్లాన్. ఆరోగ్యంగా ఉంటూనే ఆర్థికంగా స్థిరపడేలా ఈ వెల్‌నెస్ వ్యవస్థ మీకు తోడ్పడుతుంది” అనిఈ సందర్భంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ జీలానీ బాషా (JeelaniBasha)తెలిపారు.

ముఖ్యమైన ఫీచర్లు:
- 60కి పైగా తీవ్రమైన అనారోగ్యాలకు (Critical Illnesses) కవరేజీ.
- 30 ఏళ్ల వరకు మారకుండా ఉండే ప్రీమియం గ్యారెంటీ.
- మార్కెట్ ఆధారిత రాబడులతో పెరిగే హెల్త్ ఫండ్.
- కుటుంబ సభ్యులకు కూడా వర్తించే అవుట్-పేషెంట్ కవర్.
- మరణం లేదా వైకల్యం సంభవిస్తే ప్రీమియం చెల్లింపుల నుంచి మినహాయింపు.
- టర్మ్ బూస్టర్‌తో టెర్మినల్ ఇల్‌నెస్ కవరేజీ
- యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, ప్రమాదవశాత్తు పూర్తి & శాశ్వత వైకల్యానికి కవరేజీ సదుపాయం.
- హెల్త్ ఫండ్ నుండి నగదు విత్‌డ్రాలపై పన్ను మినహాయింపు.
- హెల్త్ బడ్డీ ప్రీమియంలు వాపసు
- అర్హత: 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల వయస్సు వారు చేరవచ్చు.

