డైలీ మిర్రర్ డాట్ న్యూస్,చెన్నై,ఏప్రిల్ 29, 2026: భారతదేశపు అతిపెద్ద స్టాండ్‌ఎలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్’, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఫలితాలను వెల్లడించింది.
లాభదాయకత, మెరుగైన అండర్‌రైటింగ్ ప్రమాణాలు,రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో నిలకడైన వృద్ధితో ఈ ఏడాది అద్భుతమైన ఫలితాలను సాధించినట్లు కంపెనీ తెలిపింది.
IndAS అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం, కంపెనీ పన్ను అనంతర లాభం (PAT) గత ఏడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధితో రూ. 911 కోట్లకు చేరుకుంది. ప్రీమియం వృద్ధి, కస్టమర్ల రెన్యూవల్ రేటు పెరగడం,నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటం వంటివి ఇందుకు తోడ్పడ్డాయి.
Read this also..Star Health Hits Rs.911Cr Profit Amid Sharp Metric Gains..
ఇదీ చదవండి :ఈ క్రికెట్ సీజన్‌లో ప్రతి అద్భుత క్షణాన్ని కాలిఫోర్నియా ఆల్మండ్స్‌తో ఆస్వాదించండి
మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను, కంపెనీ మొత్తం రూ. 20,369 కోట్ల గ్రాస్ రిటెన్ ప్రీమియంను (GWP) నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు 16 శాతం అధికం. ఇందులో రిటైల్ హెల్త్ ప్రీమియం వాటా రూ. 19,341 కోట్లుగా, 20 శాతం వార్షిక వృద్ధిని కనబరిచింది. దేశీయ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్లో 31 శాతం వాటాతో స్టార్ హెల్త్ అగ్రగామిగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి :ఇంటర్ పూర్తయిన విద్యార్థుల కోసం ఎన్ఐఐటీ యూనివర్సిటీ ‘క్యాంప్ ఫ్యూచర్’
కంపెనీ తన నిర్వహణ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 101.1 శాతంగా ఉన్న ‘కంబైన్డ్ రేషియో’, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 98.8 శాతానికి మెరుగుపడింది. ముఖ్యంగా నాలుగో త్రైమాసికంలో ఇది 95.7 శాతంగా నమోదైంది. నష్టాల నిష్పత్తి తగ్గడం,ఖర్చుల నియంత్రణ వల్ల ఈ సానుకూల ఫలితాలు వచ్చాయని కంపెనీ పేర్కొంది.

2026 ఆర్థిక సంవత్సరం (FY26) ముఖ్యాంశాలు:
- వ్యాపారం: స్థూల రిటెన్ ప్రీమియం (GWP) (N ప్రాతిపదికన) 16 శాతం వృద్ధితో రూ. 20,369 కోట్లకు చేరింది.
- IndAS నికర లాభం: రూ. 911 కోట్లు (FY25లో రూ. 787 కోట్లు).
- అండర్‌రైటింగ్ లాభం: FY25లో రూ. 165 కోట్ల నష్టంతో పోలిస్తే, ఈ ఏడాది రూ. 206 కోట్ల లాభం సాధించింది.
- IndAS కంబైన్డ్ నిష్పత్తి: 98.8 శాతం (FY25లో నమోదైన 101.1 శాతంతో పోలిస్తే 236 బీపీఎస్ మేర మెరుగుదల)
- నష్టాల నిష్పత్తి (Loss Ratio): 194 బీపీఎస్ మెరుగుబడి 68.7 శాతానికి తగ్గింది.
- రిటైల్ నష్ట నిష్పత్తి: 97 బీపీఎస్ మెరుగుపడి 68.2 శాతానికి నెమ్మదించింది.
- ఖర్చుల నిష్పత్తి: 31 బీపీఎస్ మెరుగుదలతో 30.1 శాతానికి మెరుగుపడింది.
నాలుగో త్రైమాసిక (Q4 FY26) ఫలితాలు:
- వ్యాపారం: స్థూల రిటెన్ ప్రీమియం (జీడబ్ల్యూపీ) (N ప్రాతిపదికన) YoY ప్రాతిపదికన 17 శాతం వృద్ధితో రూ. 6,529 కోట్లుగా నమోదైంది.
- IndAS కంబైన్డ్ నిష్పత్తి: 95.7 శాతం (FY25లో నమోదైన 98.4 శాతంతో పోలిస్తే 266 బీపీఎస్ మేర మెరుగుదల)
- వరుసగా మూడవ త్రైమాసికంలో కూడా నష్టాల నిష్పత్తి 399 బీపీఎస్ తగ్గి 65.2 శాతానికి చేరుకుంది.
- రిటైల్ నష్ట నిష్పత్తి 294 బీపీఎస్ తగ్గి 64.8 శాతానికి చేరింది.
క్లెయిమ్స్,కస్టమర్ నమ్మకం:
- స్టార్ హెల్త్ FY26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 30 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించి, రూ. 11,900 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించింది.
- కస్టమర్ల నమ్మకానికి నిదర్శనంగా రెన్యూవల్ రేటు (Persistency) 99 శాతంగా ఉంది.
- అలాగే, కస్టమర్ సంతృప్తిని కొలిచే నెట్ ప్రమోటర్ స్కోర్ (NPS) 54 నుండి 62కు పెరిగింది.

డిజిటల్ విప్లవం:
కంపెనీ వృద్ధిలో డిజిటల్ మాధ్యమాలు కీలక పాత్ర పోషించాయి. కొత్త రిటైల్ అమ్మకాల్లో 20 శాతం వాటా డిజిటల్ ఛానెళ్ల ద్వారానే లభించింది. కంపెనీకి చెందిన ‘ఆటమ్’ (Atom) యాప్‌ను లక్ష మందికి పైగా ఏజెంట్లు ఉపయోగిస్తుండగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సుమారు 84 శాతం క్లెయిమ్‌లను క్యాష్‌లెస్ పద్ధతిలో వేగంగా పరిష్కరిస్తున్నారు. స్టార్ హెల్త్ కస్టమర్ యాప్‌ను ఇప్పటివరకు 1.4 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకోగా, నెలకు 15 లక్షల మందికి పైగా దీని సేవలను వినియోగించుకుంటున్నారు.
నెట్‌వర్క్ విస్తరణ:
మార్చి 31, 2026 నాటికి స్టార్ హెల్త్‌కు దేశవ్యాప్తంగా 900కు పైగా కార్యాలయాలు, 8.3 లక్షల మంది ఏజెంట్లు, 15,000కు పైగా నెట్‌వర్క్ ఆసుపత్రులు,18,500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ పటిష్టమైన నెట్‌వర్క్ కంపెనీ దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడుతోంది.
సీఈఓ సందేశం:
“2026 ఆర్థిక సంవత్సరం స్టార్ హెల్త్‌కు ఒక క్రమశిక్షణతో కూడిన వృద్ధిని అందించింది. అండర్‌రైటింగ్ ప్రమాణాలు, నిర్వహణ సామర్థ్యంపై మేము పెట్టిన శ్రద్ధ వల్ల మెరుగైన లాభాలను సాధించగలిగాము. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు టెక్నాలజీని పెద్దపీట వేస్తున్నాము. భవిష్యత్తులో కూడా నాణ్యమైన ఆరోగ్య బీమాను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం” అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ Mr. ఆనంద్ రాయ్ పేర్కొన్నారు.
Ind AS ప్రాతిపదికన కీలక కొలమానాలు
| అంకెలు రూ. కోట్లలో | FY25 | FY26 | ||||||
| నష్ట నిష్పత్తి (i) | 70.7% | 68.7% | ||||||
| వ్యయ నిష్పత్తి (ii) | 30.4% | 30.1% | ||||||
| కంబైన్డ్ నిష్పత్తి (iii=i+ii) | 101.1% | 98.8% | ||||||
| అండర్‌రైటింగ్ లాభం/నష్టం | (165) | 206 | ||||||
| పెట్టుబడులపై ఆదాయం | 1,260 | 1,091 | ||||||
| లాభం (Profit After Tax) | 787 | 911 | ||||||

