డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2026: అభిరుచి , మహోన్నత లక్ష్యంతో నడిచే భారతదేశపు అతిపెద్ద ఫిట్నెస్ కమ్యూనిటీ అయిన ఫిటిస్తాన్, ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్‌ను సెప్టెంబర్ 27న గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ రెండవ ఎడిషన్ గన్నర్స్ సోల్జరథాన్ ను ఆర్టిలరీ రెజిమెంట్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గన్నర్ల ధైర్యం, నిబద్ధత మరియు త్యాగాలను గుర్తిస్తూ నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం గురించి వ్యవస్థాపకురాలు శిల్పా భగత్ మాట్లాడుతూ “గన్నర్స్ సోల్జరథాన్ అనేది ఒక లోతైన ఉద్దేశ్యంతో కూడిన ఫిట్నెస్ వేడుక. ఆర్టిలరీ రెజిమెంట్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దీనిని నిర్వహిస్తున్నాము. సోల్జరథాన్ ఎల్లప్పుడూ ప్రజలకు, సాయుధ దళాలకు మధ్య వారధిని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుంది” అని అన్నారు.
ఇదీ చదవండినిరంతరం స్క్రీన్లను చూస్తూ ఉండటం వల్ల మెడ నొప్పి, ఇంకా డూమ్స్క్రోలింగ్ వల్ల కలిగే అలసట..
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో అమెజాన్ సమావేశంలో ‘మీర్జాపూర్’ తారల సందడి..
మేజర్ డాక్టర్ సురేంద్ర పూనియా, విఎస్ఎం (మాజీ స్పెషల్ ఫోర్సెస్,వ్యవస్థాపకులు మాట్లాడుతూ “ఆర్టిలరీ రెజిమెంట్ రెండు శతాబ్దాల ధైర్యం, త్యాగం ,సేవా వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి గన్నర్స్ సోల్జరథాన్ మా మార్గం.
ఇదీ చదవండి:ఆటపాటలతో అంగరంగ వైభవంగా MANA సమ్మర్ పిక్నిక్..
ఈ కార్యక్రమం దేశానికి సేవ చేసిన వారిని స్మరించుకోవడం, సేవ కొనసాగిస్తున్న వారిని గౌరవించడం , క్రమశిక్షణ, దృఢత్వం,సేవ యొక్క విలువలను స్వీకరించడానికి తదుపరి తరానికి స్ఫూర్తినివ్వడం గురించినది” అని అన్నారు.

ఈ రేస్ కార్యక్రమం లో 21.0975 కి.మీ. హాఫ్ మారథాన్, 10 కి.మీ. పరుగు, 5 కి.మీ. పరుగు/నడక, 1 కి.మీ. గన్నర్స్ డే సెలబ్రేషన్ వాక్ మరియు చీర్ బడ్డీ కేటగిరీ ఉన్నాయి. హాఫ్ మారథాన్‌లో 18 ఏళ్లు,అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, 10 కి.మీ. పరుగులో 12 ఏళ్లు,అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, మరియు 5 కి.మీ. పరుగులో 10 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పాల్గొనవచ్చు. 1 కి.మీ. సెలబ్రేషన్ వాక్‌లో మూడు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, ప్రత్యేక అవసరాలు గలవారితో సహా పాల్గొనవచ్చు.
‘ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్ హైదరాబాద్’ కోసం https://www.townscript.com/e/federal-bank-gunners-soldierathon-hyderabad-2026 వద్ద నమోదు చేసుకోవచ్చు.

