డైలీమిర్రర్ డాట్ న్యూస్, సెప్టెంబర్ 25,2024:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుంది.

‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్‌ల కోసం ఫ్యాన్స్, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ను అందించారు. సెప్టెంబర్ 28న సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో విడుదల కానున్నట్లు వెల్లడించారు. పల్లవిలోని లైన్స్ ప్రకారం, మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ పాట పక్కా మాస్ బీట్ సాంగ్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు.

‘గేమ్ ఛేంజర్’ నుంచి ఇప్పటికే ‘జరగండి జరగండి..’ అనే పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తాజాగా సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లో సరికొత్త ఎనర్జీని నింపింది. వినయ విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చరణ్, కియారా అద్వాని ‘గేమ్ ఛేంజర్’లో అలరించేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్యూట్ పెయిర్ సందడిని సిల్వర్ స్క్రీన్‌పై చూడాలనే ఉత్సాహం అందరిలో కన్పిస్తోంది.

ఈ ఏడాది ముగింపులో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ మావే అనే కాన్ఫిడెన్స్ గేమ్ ఛేంజర్ యూనిట్‌లో కనిపిస్తోంది.

లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను అబ్బురపరచే రీతిలో తెర‌కెక్కించే శంకర్, ఈ ప్రాజెక్ట్‌లో గతంలో రూపొందించిన సినిమాల‌ను మించేలా ‘గేమ్ ఛేంజర్’ను రూపొందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు పొందింది.

నటీనటులు:
రామ్ చరణ్
కియారా అద్వాని
అంజలి
సముద్రఖని
ఎస్.జె.సూర్య
శ్రీకాంత్
సునీల్
జయరాం
నవీన్ చంద్ర
తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శంకర్
నిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
రైటర్స్: ఎస్.యు.వెంకటేశన్, వివేక్
స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజ్
కో ప్రొడ్యూసర్: హర్షిత్
సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణావుక్కరసు
మ్యూజిక్: తమన్.ఎస్
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
లైన్ ప్రొడ్యూసర్స్: నరసింహారావ్.ఎన్, ఎస్.కె.జబీర్
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల
యాక్షన్ కొరియోగ్రాఫర్: అన్బరివు
డాన్స్ కొరియోగ్రాఫర్స్: ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ
లిరిసిస్ట్: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్
ఎడిటర్: షామీర్ ముహ్మద్
సౌండ్ డిజైనర్: టి.ఉదయ్‌కుమార్
పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)