డైలీ మిర్రర్ డాట్ న్యూస్,సెప్టెంబర్ 15,2026: గుజరాతీ చిత్ర పరిశ్రమలో నూతన అధ్యాయం మొదలైంది. ఆ భాష నుంచి తొలిసారిగా ఓ భారీ పాన్-ఇండియా చిత్రం రాబోతోంది. అతుల్ ఇండియా మూవీస్ పతాకంపై అతుల్ ఎం. బోసమియా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీ కేసరి నందన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read this also:TCS to Accelerate AI-Led Technology Transformation for Germany’s Aareal Bank..

Read this also:One Ride 2026: Royal Enfield Calls on Riders to Support Snow Leopard Conservation..

ఇదీ చదవండి:ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్ హైదరాబాద్..

ఇదీ చదవండి:నిరంతరం స్క్రీన్‌లను చూస్తూ ఉండటం వల్ల మెడ నొప్పి, ఇంకా డూమ్‌స్క్రోలింగ్‌ వల్ల కలిగే అలసట..

దక్షిణాది మేకింగ్.. గుజరాతీ సంస్కృతి..


దైవభక్తి, సంప్రదాయాలు, విశ్వాసం అనే మూల కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో పాటు పూర్తిగా సౌత్ ఇండియన్ మేకింగ్ స్టైల్‌లో ఈ సినిమాను విజువల్ వండర్‌గా మలచనున్నారు. గుజరాతీ సంస్కృతిని, అక్కడి వారసత్వ విలువలను దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు ఈ చిత్రం ద్వారా పరిచయం చేయబోతున్నారు.

తమిళ దర్శకుడి సారథ్యంలో..


ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ద్వారా గుజరాతీ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనేది నిర్మాతల లక్ష్యం. అవార్డు గ్రహీత, ప్రముఖ తమిళ దర్శకుడు సబ్రినాథన్ ముత్తుపాండియన్ ఈ చిత్రానికి కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అర్పిత రాంకా, మౌలిక్ చౌహాన్ లీడ్ రోల్స్ చేస్తుండగా.. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు.

2027 శ్రీరామనవమి టార్గెట్..


ఈ బృహత్తర ప్రాజెక్టును 2027 శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మాతృక గుజరాతీతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ తదితర ఏడు భారతీయ భాషల్లో ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు..

బ్యానర్: అతుల్ ఇండియా మూవీస్

నిర్మాత: అతుల్ ఎం. బోసమియా

సహ నిర్మాతలు: మహిపాల్ సింగ్ రాణావత్, రాజేష్ ఠాకూర్, హిరెన్ పటేల్, పరేష్ జగ్దా

దర్శకత్వం: సబ్రినాథన్ ముత్తుపాండియన్

సంగీతం: అభినందన్ కశ్యప్ (కన్నడ)

సినిమాటోగ్రఫీ: సుభాష్ దండపాణి..