డైలీ మిర్రర్ డాట్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 24,2026:పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణలో వేగంగా వృద్ధి చెందుతున్న ‘ఆల్‌పెట్స్ క్లినిక్’ (Allpets Clinic) తన సేవలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నల్లగండ్లలో తమ రెండవ అత్యాధునిక పశువైద్య కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించింది. రాబోయే 12 నెలల్లో దక్షిణ భారతదేశవ్యాప్తంగా మరో 10 కొత్త క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది.

నల్లగండ్లలోని హుడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లేఅవుట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌ను ప్రముఖ టాలీవుడ్ నటుడు సుశాంత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈఓ డాక్టర్ జస్లీన్ కౌర్, కో-ఫౌండర్లు ఎ. అరుణ్ కుమార్, ఎం. తిరుమలై పాల్గొన్నారు.

అత్యాధునిక సదుపాయాలతో 1200 అడుగుల విస్తీర్ణంలో..
దాదాపు 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో జంతువులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులకు సాధారణ వైద్య పరీక్షలు, టీకాలు, రోగ నిర్ధారణ (డయాగ్నోస్టిక్స్), శస్త్రచికిత్సలు, అత్యవసర సేవలతో పాటు ఫార్మసీ సదుపాయాన్ని కల్పించారు. గడచిన పదేళ్లలో ఆల్‌పెట్స్ సంస్థ 15,000 మందికి పైగా పెట్ ఓనర్లకు సేవలు అందించిందని, ఇప్పటివరకు 57,000 కన్సల్టేషన్లు, 1,000కు పైగా సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసిందని ప్రతినిధులు వెల్లడించారు.

దూరభారం తగ్గించేందుకే: సీఈఓ జస్లీన్ కౌర్
ప్రారంభోత్సవం సందర్భంగా సీఈఓ డాక్టర్ జస్లీన్ కౌర్ మాట్లాడుతూ.. “పెంపుడు జంతువులకు అత్యవసర వైద్యం అవసరమైనప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన కష్టం ఉండకూడదు. నల్లగండ్ల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెంపుడు జంతువులను పెంచేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకునే మా తొలి క్లినిక్‌లోని సేవలన్నింటినీ ఇక్కడి వారికి కూడా చేరువ చేశాము” అని తెలిపారు.

Read this also:Allpets Clinic Eyes South India Expansion with New Hyderabad Facility..

Read this also:Amazon Pay launches HealthInsurance in partnership with HDFCERGO..

జాతీయ స్థాయి ప్లాట్‌ఫామ్‌గా విస్తరణ
ఒకే క్లినిక్‌తో మొదలైన తమ ప్రయాణం ఇప్పుడు మల్టీ-సిటీ నెట్‌వర్క్‌గా మారుతోందని కో-ఫౌండర్ ఎ. అరుణ్ కుమార్ తెలిపారు. దక్షిణాదిలో 10 క్లినిక్‌ల ఏర్పాటు తర్వాత, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి నెట్‌వర్క్‌గా విస్తరించాలనేది తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

Read this also:Atul India Movies Announces ‘Sri Kesari Nandan’, Gujarati Cinema’s First Pan-India Film

ఇదీ చదవండి:ఫెడరల్ బ్యాంక్ గన్నర్స్ సోల్జరథాన్ హైదరాబాద్..

భారత్‌లో పెట్ కేర్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, యజమానుల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో నాణ్యమైన, వ్యవస్థీకృత వెటర్నరీ సేవల అవసరం ఎంతో ఉందని మరో కో-ఫౌండర్ ఎం. తిరుమలై అభిప్రాయపడ్డారు. ఈ పదేళ్ల వృద్ధి ప్రయాణంలో నల్లగండ్ల క్లినిక్ ఒక కీలక మైలురాయి అని సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.