డైలీ మిర్రర్ డాట్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 19,2026: హైదరాబాద్ పర్యాటక రంగంలో మరో సరికొత్త ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. నగర నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత సంజీవయ్య పార్క్‌లో అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన మల్టీమీడియా లేజర్ షో, వాటర్ స్క్రీన్ ప్రొజెక్షన్, మ్యూజికల్ ఫౌంటెన్‌ను తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (TGTDC) ప్రజల సందర్శనార్థం ప్రారంభించింది. https://www.tgtdc.com/

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో సుమారు రూ.49.65 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేశారు. భాగ్యనగరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, నగరవాసులకు ఆహ్లాదకరమైన సాయంత్రపు వినోదాన్ని అందించడమే లక్ష్యంగా దీనిని రూపొందించారు.
Read this also:Pallavi Model School Boduppal Hosts South Zone CBSE Boys Chess Championship 2026..
Read this also:Samsung Solve for Tomorrow Expands to 135 Cities, Strengthens Innovation Among India’s Youth
ప్రత్యేక ఆకర్షణలు..
కనువిందు చేసే లేజర్ ప్రొజెక్షన్లు: వాటర్ స్క్రీన్‌పై ప్రదర్శించే వర్ణరంజిత దృశ్యాలు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి.
సంగీతానికి అనుగుణంగా ఫౌంటెన్: మధురమైన బాణీలకు అనుగుణంగా లయబద్ధంగా నాట్యం చేసే నీటి ధారలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి.
కుటుంబ సమేత వినోదం: పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సాయంత్రం వేళల్లో ఆహ్లాదంగా గడిపేందుకు ఇది అద్భుత వేదికగా నిలవనుంది.
ప్రదర్శన సమయాలు – టికెట్ వివరాలు..
షో సమయాలు (రోజూ రెండు ప్రదర్శనలు):
మొదటి ప్రదర్శన.. సాయంత్రం 7:00 గంటల నుంచి 7:30 గంటల వరకు
రెండవ ప్రదర్శన..రాత్రి 8:00 గంటల నుంచి 8:30 గంటల వరకు

ప్రవేశ రుసుము..
పెద్దలకు: ₹150/- (ఒక్కొక్కరికి)
పిల్లలకు (5 నుంచి 12 ఏళ్లు): ₹120/-
సందర్శకులకు ఆహ్వానం..
నగర ప్రజలతో పాటు పర్యాటకులందరూ ఈ సరికొత్త పర్యాటక దృశ్య వైభవాన్ని తిలకించి ఆస్వాదించాలని TGTDC అధికారులు కోరారు.
సమాచారం, బుకింగ్ వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
9848126947, 9848125720, 9848306435, 8340811234. https://www.tgtdc.com/

