డైలీమిర్రర్ డాట్ న్యూస్, అమరావతి, (ఆంధ్రప్రదేశ్ బ్యూరో),ఆగస్టు19,2026 : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో భర్తీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల వ్యవహారం కూటమి రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఖాళీగా ఉన్న రెండు నామినేటెడ్ స్థానాల పంపకాలపై తెలుగుదేశం, బీజేపీ వర్గాల్లో రకరకాల సమీకర ణాలు తెరపైకి వస్తున్నాయి.
తొలుత ఈ రెండు స్థానాలనూ టీడీపీ తన సీనియర్ నేతలకే కేటాయిస్తుందనే ప్రచారం విస్తృతంగా సాగినప్పటికీ, కూటమి ధర్మంలో భాగంగా ఒక స్థానాన్ని బీజేపీ ఆశిస్తుండటంతో ఎంపిక ప్రక్రియ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Read this also:Uber Launches Bike Taxi Service in Warangal, Offers Free First Ride for Limited Period..
Read this also:Pallavi Model School Boduppal Hosts South Zone CBSE Boys Chess Championship 2026..
ప్రచారంలో టీడీపీ సీనియర్ల పేర్లు..
ప్రస్తుతం గవర్నర్ కోటా కింద నామినేట్ చేసేందుకు టీడీపీ(TDP) అధిష్ఠానం వద్ద పలువురు సీనియర్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, రాయలసీమ ప్రాంతం నుంచి రమాదేవి (అనంతపురం) పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ పేర్లపై అధికారికంగా ఎటువంటి ప్రకటన గానీ, మంత్రివర్గ తీర్మానం గానీ ఇంకా వెలువడలేదు.
బీజేపీ పట్టు.. నితిన్ నబిన్ పర్యటనతో ఊపందుకున్న చర్చ..
మరోవైపు, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) సైతం గవర్నర్ కోటాలో ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. గతంలో కుదిరిన ప్రాథమిక చర్చల నేపథ్యంలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీకి దక్కే అవకాశం ఉందన్న వాదన పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
ఇటీవల బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఈ అంశంపై అంతర్గతంగా కీలక చర్చ జరిగినట్లు సమాచారం. గవర్నర్ కోటాలో పార్టీకి కచ్చితంగా ప్రాతినిధ్యం ఉండాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు ఆయన రాష్ట్ర నేతలతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ తీర్మానమే కీలకం..

రాజ్యాంగ నిబంధనల ప్రకారం, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను మంత్రివర్గం ఆమోదించిన తీర్మానం మేరకు రాష్ట్ర గవర్నర్ నామినేట్ చేస్తారు. కూటమిలోని ప్రధాన పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య సంపూర్ణ సమన్వయం కుదిరిన తర్వాతే జాబితాను ఖరారు చేయనున్నారు.
సామాజిక, ప్రాంతీయ సమతుల్యత.. అభ్యర్థుల ఎంపికలో ప్రాంతీయ సమీకరణాలు, పార్టీ విధేయత, సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తే, టీడీపీకి మిగిలే ఒక స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

